V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి హనుమంతరావు అన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ సీట్లలో ఏడాదికి 25 లక్షలు కట్టాలని చెప్తున్నారు.. మరి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఏ విధంగా కడుతున్నారు? అని ప్రశ్నించారు. ఓబీసీలకు న్యాయం చేయాలని తెలిపారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. సమాజంలో ఎవరి శాతం ఎంత అనేది చేయాలని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు.
Read also: Fire Accident: వారణాసి రైల్వేస్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 200 బైక్స్
తెలంగాణలో సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బీసీ కుల గణన బిల్లును అసెంబ్లీలో పాస్ చేశారని వీహెచ్ అన్నారు. తెలంగాణలో కుల గణన 85% పూర్తయిందన్నారు. బీసీ ప్రధానమంత్రిగా మోడీ ఉన్నారు, ఓబీసీలకు న్యాయం జరుగుతుందా లేదా ? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కుల గణన చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలు ఓట్లు వేయడం లేదా బీజేపీకి అని ప్రశ్నించారు. ఓట్లు వేసిన మాకు అన్యాయం జరుగుతుంటే నరేంద్ర మోడీ ఓ బీసీ గా ఉండి ఏమీ చేయడం లేదన్నారు.
Read also: TGPSC: టీజీపీఎస్సీ కొత్త చైర్మన్‌గా బుర్రా వెంకటేశం..
మణిపూర్ లో ప్రజలు చనిపోతున్న ప్రధాని మోడీకి వెళ్లాలని ఆలోచన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన బిల్లు పెడితే కాంగ్రెస్ దానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఓట్లు బీసీలవి రాజ్యం మీదంటే నడవదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసినప్పుడు మేము ఏమి అడ్డుపడలేదని గుర్తుచేశారు. ఓబీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలన్నారు. మోడీని ఇప్పటివరకు మూడుసార్లు కలిశానని తెలిపారు.
Revanth Reddy Tweet: ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ వైరల్..