V. Hanumantha Rao : బీజేపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వక్రికరించే పనిలో ఉందని, మోడీ సర్కార్ రిమోట్ కంట్రోల్ మోహన్ భగవత్ దగ్గర ఉందని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య కట్టిన రోజే స్వాతంత్య్రం వచ్చింది అని అనడం సరికాదని, భగత్ సింగ్ లాంటి వాళ్ళ త్యాగాన్ని అవమానించినట్టు అని ఆయన మండిపడ్డారు. మోడీ.. సమాధానం చెప్పాలని, అమిత్ షా…అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలన్నారు వీహెచ్. చరిత్ర వక్రీకరిస్తున్నారని, బీజేపీ తీరు ప్రజలకు తెలియజేయాలని, పార్టీ కార్యకర్తలు, గాంధీనీ చంపిన వారు.. ఇప్పుడు చరిత్రను వక్రీకరణ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Chandrababu: రేపు మైదుకూరులో ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్’ ప్రారంభించనున్న చంద్రబాబు
బీజేపీ కి బుద్ధి చెప్పాలని, కేటీఆర్… నీకు దమ్ముంటే డిల్లీలో ప్రచారం చేసి చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇక్కడ మాట్లాడితే ఏం లాభమని, రేవంత్ రెడ్డి మీద కాదు… ఢిల్లీ ఎన్నికల ప్రచారం లో చెప్పు అని ఆయన వ్యాఖ్యానించారు. కేటీఆర్ ధర్నా చేస్తే చేసుకోమని.. ఆయన రోజు ధర్నా చేయాలని, ధర్నా చౌక్ లో కూర్చుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఆయనకు అని ఆయన అన్నారు. ధర్నా చౌక్ ఇవాళ గుర్తుకు వచ్చింది కేటీఆర్ కి, ధర్నా చౌక్ తెచ్చింది మేము.. ధర్నా చౌక్ లో కూర్చునే అవకాశం మేమే ఇచ్చామన్నారు. మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్ లో… మీరు ధర్నా చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు వీహెచ్.
Loan on Aadhaar Card: అర్జెంటుగా డబ్బులు కావాలా?.. ఆధార్ కార్డుతో ఐదు లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్!