మంత్రి పదవి కూడా చేయని కిరణ్ కుమార్ రెడ్డి ని సీఎం చేసింది కాంగ్రెస్ అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు. ఇవాళ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరారు. అయితే.. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై పలు విమర్శలు గుప్పించారు. దీనికి కౌంటర్‌గా వీహెచ్ స్పందిస్తూ.. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాలని, కానీ పార్టీ వదిలి పారిపోవడం ఏంటి..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Samnatha: న్యూడ్ సీన్స్.. సమంత మళ్లీనా..?
కాంగ్రెస్ మీ దెబ్బకొట్టాలని చూస్తున్న బీజేపీలో చేరడం దుర్మార్గమని ఆయన దుయ్యబట్టారు. కిరణ్ కుమార్ రెడ్డి.. న్యాయమా రా బై నీకూ అంటూ ఆయన నిప్పులు చెరిగారు. రెండున్నర ఏండ్లలో నువ్వు.. నీ తమ్ముడు ఎంత సంపాదించారో మాకు తెలియదా అని ఆయన ధ్వజమెత్తారు. సీఎం ని చేసిన పార్టీ కి వెన్నుపోటు పొడిచిన వాడు.. బీజేపీ కి వెన్నుపోటు పొడవడు అని గ్యారంటీ ఏముందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ మారడం ఆయనకు వ్యాపారం అయ్యిందని, ఉన్నవి దాచుకోవడం కోసమే బీజేపీ లోకి వెళ్ళాడని వీహెచ్ ఆరోపించారు. భయంతో బీజేపీ లోకి వెళ్ళవా… బెదిరిస్తే పోయావా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!