మోడీ ప్రధాని అయ్యాక కేవలం బడా వ్యాపారులకే ప్రయోజనం చేకూరుతుందని, సామాన్యులకు ఒరిగింది ఏమి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటీశ్వరులకి మాత్రం బ్యాంకులు లక్షల కోట్ల అప్పులు ఇస్తాయని, పేదలు, రైతులకు మాత్రం రుణాలు ఇయ్యవని ఆయన ఆరోపించారు. ఇచ్చినా.. కట్టే వరకు పీడించుకుంటాయని ఆయన మండిపడ్డారు. ఆదాని షేర్లు పడిపోవడం వల్ల బ్యాంకుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అంటున్నారని, దేశంలో పోర్టులు, బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్లు అన్నీ అమ్మకానికి పెట్టేస్తున్నారని, ఆదానికి కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కూడా అమ్మేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
దేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీని, గంగవరం పోర్టును ఎవడబ్బ సొమ్ము అని అమ్మేస్తున్నారని, పేదవాడి కోసం మోడీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆదాని ఆస్తులపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారని ఆయన అన్నారు. ఈ నెల 15 తరువాత విశాఖ వెళ్లి అన్ని పార్టీల నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్నారు.
Also Read : Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
