Site icon NTV Telugu

V.Hanumantha Rao : బీజేపీ నాయకులు కొత్త ఆరోపణలకు తెరలేపారు

Vh

Vh

రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు జేపీ నడ్డా, బండి సంజయ్ కొత్త ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి.హనుమంత రావు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడాడని రాహుల్ గాంధీ ఓబీసీలకు క్షమపణలు చెప్పాలని కొత్త వాదన వినిపిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు క్షమపణలు చెప్పాలి ? అదానీపై పార్లమెంట్ లో ప్రశ్నించినందుకా అని ఆయన ప్రశ్నించారు. అదానీ విషయంపై ప్రజల దృష్టి మరల్చడానికే ఓబీసీల అంశాన్ని తెర మీదకు తెచ్చారన్నారు. ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.

Also Read : Special Package For Ap: ప్రత్యేక హోదా స్థానంలోనే ప్రత్యేక ప్యాకేజి

రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారు అనే విషయం పై చర్చిద్దామన్నారు. ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయి… ఇప్పుడు తొమ్మిదేళ్ళ లుగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది అనే విషయం పై చర్చిద్దామని ఆయన సవాల్‌ విసిరారు. అదానీ గురించి మాట్లాడితే ఓబీసీ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజల దృష్టి మరల్చడానికీ బీజేపీ ప్రయత్నిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఓటు బ్యాంకు రాజకీయలకు బీజేపీ ఓబీసి అంశాన్ని వాడుకుంటుందని, ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు తో సహా ఓబీసీ విద్యార్థులు మేధావులను పాల్గొనాలన్నారు. వాయినడ్ ఎన్నికలకు 30 రోజుల గడువును ఇస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుందని, సీఈసికి ఉన్న ఆలోచనా పార్లమెంట్ లో స్పీకర్‌కు లేదని తేలిపోయిందన్నారు. స్పీకర్ బీజేపీ పార్టీకి తోత్తుగా పని చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

Also Read : Jewellery Robbery: దొంగల మాస్టర్ ప్లాన్.. ఏకంగా జువెలరీ షాప్‌లోకి సొరంగం.. భారీ దోపిడి..

Exit mobile version