V.Hanumantha Rao : రాజగోపాల్ రెడ్డి పోతా అని అంటుంటే… ఆయన దగ్గరికి పోయి నేనేం చేయాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress Party Senior Leader V.Hanumantha Rao about MLA Komatireddy Rajgopal Reddy Issue.
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పుడిప్పుడే తెలంగాణలో మళ్లీ పుంజుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్‌రెడ్డి బీజేపీ చేరేందుకు వ్యూహాలు రచిస్తుండటంతో కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్‌రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ సీనియర్ నాయకులు వి.హనుమంత రావును రంగంలోకి దింపింది. అయితే కాంగ్రెస్ పార్టీలో నాకు ఘోర అవమానం జరిగిందని, ఇక పార్టీలో ఉండనని రాజగోపాల్‌రెడ్డి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వి.హనుమంతరావు మాట్లాడుతూ.. అజాధి కా అమృత్ మహోత్సవం అని బీజేపీ అంటుంది కానీ.. జాతీయ జెండా రూపొందించిన పింగళి వెంకయ్య నీ మర్చిపోయారని ఆయన విమర్శించారు. ఆగస్ట్ 2న పింగళి వెంకయ్య పుట్టిన రోజున కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి…కి లేఖ రాసిన కానీ పట్టించుకోలేదని ఆయన వెల్లడించారు. జెండా తయారు చేసిన తెలుగు వాడికి గౌరవం లేకుంటే ఎలా..? అని ఆయన ప్రశ్నించారు.
Also Read
- AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
- High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
- Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ 'పాలక్ పరోటా'.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- CM Vijay: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మందుబాబులకు బిగ్ షాక్!
పింగళి వెంకయ్యకి గుర్తింపు లేకుంటే ఇంకేముందని, ఎవరెవరికి ఉత్సవాలు చేస్తారు… జెండా రూపొందించిన వ్యక్తి కి గుర్తింపు లేదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పింగళి వెంకయ్యను గౌరవించాలని.. అయన వారసులకు కూడా గౌరవం దక్కాలన్నారు. అంతేకాకుండా.. ఇక్కడ పరిస్థితి బాగోలేదు అని దిగ్విజయ్ సింగ్ కి రాజగోపాల్ రెడ్డి చెప్పారట, బీజేపీ లోకి పోవాలని డిసైడ్ అయ్యాడని, పార్టీ లో ఆయనకు గుర్తింపు లేదు అని అంటున్నాడని ఆయన తెలిపారు. ఒరిజినల్ కాంగ్రెస్ లో వాళ్లకు అన్యాయం జరిగింది అని చెప్పాడని, అందుకే నా దారి నేను చూసుకుంటా అన్నాడంటూ హనుమంతరావు వెల్లడించారు. పోతా అని అయన అంటుంటే… అయన దగ్గరికి పోయి నేనేం చేయాలని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
AIADMK MLAs Support Vijay: అన్నాడీఎంకేలో భారీ చీలిక.. విజయ్ గూటికి 30 మంది ఎమ్మెల్యేలు..
-
Madhav Tiwari: నేను 4 ఓవర్లు బౌలింగ్ చేశా, ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.. డీసీ ప్లేయర్ ఆనందం!
-
High Court: భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య.. జస్ట్ రూ.500 జరిమానా విధించి నిర్దోశిగా తేల్చిన హైకోర్టు
-
Cannes 2026: కేన్స్ ఫెస్టివల్లో దేశీ గ్లామర్ షో.. ఖర్చులు చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..