V.Hanumantha Rao : నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంత రావు మాట్లాడుతూ.. నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోందిన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్న హైదరాబాద్ లో భారీ వర్షాలు వస్తే అనేక కాలనీలు ముంపు అవుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లో వరదల వల్ల జరిగే ముంపును ప్రభుత్వం నివారించాలని, ఇప్పుడు ముంపునకు గురైన బాధితులకు కుటుంబానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కమిషనర్ కాంగ్రెస్ నాయకులను అవమానించారని, రాహుల్ గాంధీ బీసీ లను ఎలాంటి అవమానకర మాటలు అనలేదన్నారు. ఆయన మోడీలపై మాట్లాడితే బీసీల గురించి మాట్లాడినట్టు బీజేపీ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ ఔట్ అవుతారు.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read : Ameesha patel : నటి అమిషా పటేల్ కు షాక్ ఇచ్చిన రాంచి సివిల్ కోర్ట్..
Also Read
అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలం అయిందని, కేంద్రం నుంచి వరదల కోసం సహాయంగా 150 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు కోదండరెడ్డి. ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదని, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు లో వరదలు వచ్చి డాం పైనుంచి నీరు వెళ్లాయని, గేట్లు తెరుకోలేదు.. సంబంధించిన మంత్రి మేము మానవ ప్రయత్నం చేసాము అంటున్నారన్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల గురించి చర్చించాల్సి ఉందని ఆయన అన్నారు.
Also Read : Girls Videos Row: కాలేజీ వాష్‌రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్
తాజావార్తలు
-
Chhatta Bazaar Arch Collapse : హైదరాబాద్లో భారీ వర్షాల ఎఫెక్ట్.. పాతబస్తీలో కూలిన చారిత్రక కమాన్.!
-
AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
-
Dubai Road Accident: దుబాయిలో ఘోర రోడ్డు ప్రమాదం.. జగిత్యాలకు చెందిన ముగ్గురు దుర్మరణం
-
Kitchen Hacks: వంట పనిని సగం తగ్గించే కిచెన్ టిప్స్ .. బిగినర్స్ కోసం స్పెషల్ గైడ్!
-
CM Revanth Reddy : మహిళల చేతుల్లోనే తెలంగాణ ప్రగతి
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!