NTV Telugu Site icon

V.Hanumantha Rao : నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోంది..

V Hanumantha Rao

V Hanumantha Rao

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అయితే.. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వి. హనుమంత రావు మాట్లాడుతూ.. నగరం మాములు వర్షాలకు సైతం ముంపుకు గురవుతోందిన్నారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతున్న హైదరాబాద్ లో భారీ వర్షాలు వస్తే అనేక కాలనీలు ముంపు అవుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లో వరదల వల్ల జరిగే ముంపును ప్రభుత్వం నివారించాలని, ఇప్పుడు ముంపునకు గురైన బాధితులకు కుటుంబానికి 15 వేల రూపాయలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కమిషనర్ కాంగ్రెస్ నాయకులను అవమానించారని, రాహుల్ గాంధీ బీసీ లను ఎలాంటి అవమానకర మాటలు అనలేదన్నారు. ఆయన మోడీలపై మాట్లాడితే బీసీల గురించి మాట్లాడినట్టు బీజేపీ ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ ఔట్ అవుతారు.. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Also Read : Ameesha patel : నటి అమిషా పటేల్ కు షాక్ ఇచ్చిన రాంచి సివిల్ కోర్ట్..

అనంతరం కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు కోదండరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీ వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రంలో భారీ వర్షాలతో అతలాకుతలం అయిందని, కేంద్రం నుంచి వరదల కోసం సహాయంగా 150 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు కోదండరెడ్డి. ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేదని, ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు లో వరదలు వచ్చి డాం పైనుంచి నీరు వెళ్లాయని, గేట్లు తెరుకోలేదు.. సంబంధించిన మంత్రి మేము మానవ ప్రయత్నం చేసాము అంటున్నారన్నారు. ఇంత ఘోరం జరుగుతుంటే సీఎం కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టి ప్రజల గురించి చర్చించాల్సి ఉందని ఆయన అన్నారు.

Also Read : Girls Videos Row: కాలేజీ వాష్‌రూంలో నగ్న దృశ్యాల చిత్రీకరణ.. స్పందించిన జాతీయ మహిళా కమిషన్