Uttarkashi Avalanche: ఉత్తరకాశీ హిమపాతం ఘటనలో 26కు చేరిన మృతుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarkashi Avalanche: ఉత్తరాఖండ్ లో హిమపాతంలో చిక్కుకున్న వారికోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్లను సహాయక చర్యల కోసం వినియోగిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు మొత్తం 26మంది చనిపోయారు. వారి మృతదేహాలు ఇప్పటికే తరలించినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. కాగా, మంగళవారం నుంచి సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా అదేరోజు నాలుగు మృతదేహాలు లభ్యమయ్యాయి. బుధవారం ఒక్కబాడీ కూడా లభించలేదు. గురువారం 15 మృతదేహాలను, శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల వరకు మరో 7 మృతదేహాలను వెలికితీశారు.
Read Also: Flight Tickets: టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఫ్లైట్ టిక్కెట్లు ఫ్రీ
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
కశ్మీర్‌లోని ఓ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ట్రెయినీ పర్వతారోహకులు గత మంగళవారం ఉదయం 9 గంటలకు ఉత్తరకాశీలోని ఓ పర్వత బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంతరం పర్వతాన్ని అధిరోహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా హిమపాతం సంభవించింది. ట్రెయినీ మౌంటెనీర్స్ అంతా ఆ మంచు దిబ్బల కింద గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఆర్మీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ తదితర బృందాలు సహాయక చర్యులు నిర్వహిస్తున్నాయి.
Read Also: Strongest Man: వామ్మో!.. ఏకంగా 548కిలోలు ఎత్తేశాడుగా
వీళ్లంతా శిఖరం అధిరోహించేందుకు ఎత్తైన పర్యతాలకు వెళ్లారు. అటు వాతావరణం అనుకూలించకపోవటంతో…సహాయక చర్యలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. అటు హిమపాతంలో చిక్కుకున్న పర్వాతారోహకులు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. వీళ్లంతా నెహ్రూ మౌంటేనీరింగ్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనీలుగా ఉన్నారు. కాగా, మంచులో చిక్కుకున్న వారిలో 8 మందిని ఇప్పటివరకు సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిస్థితిపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పర్యవేక్షిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!