NTV Telugu Site icon

Uttam Kumar Reddy : గత ప్రభుత్వం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బిఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను గత పది సంవత్సరాల బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవము కాదా? అని ఆయన ప్రశ్నించారు. 1.81 లక్షల కొట్లు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చినా కృష్ణా జలాల విషయంలో అన్యాయం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మంత్రి ఉత్తమ్‌ ఫైర్‌ అయ్యారు. వారి హయాంలో కృష్ణా బేసిన్లో ఉన్న ఏ ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోగా నిధులు కేటాయించడంలో కూడా పూర్తి నిర్లక్ష్యం వహించారని, అందువల్ల ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్ట్ లు కోల్పోవడం జరిగిందన్నారు.

Union Minister Hardeep Singh Puri: ఏపీకి రికార్డు స్థాయి కేటాయింపులు.. పెట్రో ధరలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

అంతేకాకుండా..’ నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీ సొరంగము ద్వారా నిండే , రిజర్వాయర్స్ కెపాసిటీ 10 టీఎంసీలు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ రిజర్వాయర్స్ కెపాసిటీ 25 టిఎంసిలు , పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రిజర్వాయర్స్ కెపాసిటీ 65 టిఎంసిలు. ఈ మూడు ప్రాజెక్టు లే కాకుండా కృష్ణా బేసిన్ లోని వివిధ దశలలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులు కేటాయించకుండా పూర్తి నిర్లక్ష్యం వహించి దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులను తెచ్చింది బీఆర్‌ఎస్‌ హయాంలోనే కాదా? గత పది సంవత్సరాల నుండి వివిధ ప్రాజెక్టుల కింద భూసేకరణ కూడా చేయకుండా జరగకుండా నిర్లక్ష్యం వహించింది బి.ఆర్. ఎస్ ప్రభుత్వం కాదా? అందువల్ల ఆ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదన్న విషయం మీకు తెలియదా? కృష్ణా బేసిన్ లోని కొన్ని ప్రాజెక్ట్ లలో కాలువలు , డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా ? కృష్ణా బేసిన్ లోని సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకపోవడానికి గత పది సంవత్సరాలు పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గార్లు కారణం కాదా? దానిలో అప్పటి జిల్లా మంత్రిగా మీ బాధ్యత లేదా? రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోని మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే మూడు సంవత్సరాలలో కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్ట్ లను అన్నింటిని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం.’ అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Fastag : ఫాస్టాగ్ కొత్త నియమాలపై స్పష్టత ఇచ్చిన NHAI.. ఇక వాళ్లకు ఫైన్లు పడవు