NTV Telugu Site icon

Uttam Kumar Reddy : సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు

Uttam

Uttam

Uttam Kumar Reddy : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించి, అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు రాష్ట్ర పౌరసరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్ తో కలసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. ఈనెల 23 నుండి 25 వరకు జరగనున్న ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. సర్వమత సమ్మేళనానికి ప్రతీక జాన్ పహాడ్ దర్గా ఉర్సు అని ఆయన అన్నారు. లక్షలాదిగా వచ్చే భక్తులకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. జాన్ పహాడ్ వద్ద కొత్తగా నిర్మించే ఎత్తి పోతల జవహర్ లాల్ నెహ్రూ పేరు పెడతామని, అర్హులైన వారికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….

రేషన్ కార్డులు పంపిణీ తర్వాత సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నామని ఆయన తెలిపారు. పదేళ్ల BRS పాలనలో కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, కొత్తగా మేము 40 లక్షల మందికి పైగా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డు పొందలేని వారు… మళ్ళీ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. రేషన్ కార్డుల మంజూరు పై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఆయన వ్యాఖ్యానించారు.

Saif Ali Khan: సైఫ్‌పై దాడి “అంతర్జాతీయ కుట్ర” అనుమానం.. 5 రోజుల కస్టడీ విధించిన కోర్ట్….