పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బ్రో సినిమా ఇటీవలే ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందిన బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.పవన్ తన తరువాత సినిమా ఏంటి అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల లో ఏది ముందు వస్తుందో క్లారిటీ లేదు. ఇప్పటి వరకు పవన్ సన్నిహితులు కూడా ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు.కానీ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సంక్రాంతికి విడుదల అవుతుందని ప్రచారం జరుగుతుంది.మొన్నటి వరకు ఓజీ సినిమా షూటింగ్ వేగంగా జరిగింది దీనితో మొన్నటి వరకు ఈ ఏడాదే ఓజి సినిమా విడుదల అవుతుందని ప్రచారం కూడా జరిగింది.
కానీ ఓజీ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది.బ్రో సినిమా ఫలితం నేపథ్యం లో ఉస్తాద్ భగత్ సింగ్ ను త్వరగా ముగించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని పవన్ నిర్ణయించుకున్నారని సమాచారం.. అందుకే పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కి డేట్లు కేటాయించడం జరిగిందని సమాచారం.దీనితో దర్శకుడు హరీష్ శంకర్ కేవలం 50 వర్కింగ్ డేస్ లో సినిమాను పూర్తి చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఏపీ లోనే ఎక్కువ శాతం షూటింగ్ ను జరిపేందుకు కూడా హరీష్ ప్లాన్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్ల ఆధారంగా నైట్ షూట్స్ ను కూడా నిర్వహించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం.ఈ నేపథ్యం లో పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను హరీష్ శంకర్ ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. ప్రస్తుతం పవన్ ఈ నెల 10 నుండి మరోసారి వారాహి యాత్ర కు సిద్ధం అవుతున్నాడు. ఆ యాత్ర పూర్తి కాగానే మళ్ళీ షూటింగ్స్ హాజరవుతాడని సమాచారం.