Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కు మరో శుభవార్త.. హరీష్ శంకర్ కీలక ప్రకటన

Pawan Kalyan

Pawan Kalyan

ఎంట్రీతోనే పాలిటిక్స్ లో ప్రభంజనం సృష్టించిన పవన్ కళ్యాణ్ మళ్లీ ఫ్యాన్స్ ను వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా రూపొందిన హిస్టారికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా తొలి భాగం ఈ నెల 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

Also Read:Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో శుభవార్త అందించారు దర్శకుడు హరీష్ శంకర్. జూన్ రోండోవ వారం నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర షూటింగ్ ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పవన్ నటిస్తున్న మరో మూవీ ఓజీ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఉస్తా్ద్ భగత్ సింగ్ పట్టాలెక్కనుంది. పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే మొదటిసారి మూడు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

Also Read:RCB vs PBKS: వారి కోసమైనా ఐపీఎల్ టైటిల్ సాధిస్తాం.. ఆర్సీబీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

వరుస సినిమాలతో అభిమానులను అలరించేందుకు పవన్ కళ్యాణ్ రెడీ అవుతుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పవన్ ఫ్యాన్స్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే సినిమా అవుద్దని, మూవీ లైబ్రరీలో దాచిపెట్టుకునే సినిమా అని, రిపీట్ గా చూసే చిత్రమని, పవన్ నుంచి ఏం ఆశించి థియేర్ కు వస్తారో అవన్నీ ఉంటాయని డైరెక్టర్ హరీష్ శంకర్ గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

Exit mobile version