NTV Telugu Site icon

IND VS AUS: తొలి రోజు ఆసీస్ దూకుడు.. సెంచరీతో చెలరేగిన ఖవాజా

Ind Vs Aus

Ind Vs Aus

IND VS AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ ను ఆసీస్ టీం ఘనంగా ఆరంభించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కెప్టెన్ నమ్మకాని నిలబెడుతూ ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 251 బంతుల్లో ( 104 పరుగులు, 15 ఫోర్లు ) సెంచరీ బాధాడు. కెమరూన్ గ్రీన్ 64 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో ఆసీస్ జట్టు 255 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ ( 38 ), ట్రావిస్ హెడ్ ( 32 ) ఫర్వలేదనిపించారు. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, జడేజాలకు చెరో వికెట్ లభించింది.

టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి వచ్చిన ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా ఆరంభం నుంచే పరుగులు సాధించడం మొదలు పెట్టారు. గత మూడు టెస్టులకు విభిన్నంగా నాలుగో టెస్టులో పిచ్ ఉంది. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటంతో ఆస్ట్రేలియా బ్యాటర్లు పోర్లతో విరుచుపడ్డారు. అదే సమయంలో భారత వికెట్ కీపర్ శ్రీకర్ భారత్ పలు క్యాచ్ లను నెలపాలు చేశాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన అశ్విన్ ట్రావిస్ హెడ్ ను అవుట్ చేసి భారత్ కు తొలి బ్రేక్ ను అందించాడు. హెడ్ అవుటైన కాసేపటికే లబుషేన్ ను జడేజా పెవిలియన్ కు పంపించాడు. అనంతరం మరో వికెట్ పడకుండా జగ్రత్త పడ్డ స్మిత్, ఖవాజా లంచ్ బ్రేక్‌కు వెళ్లారు.

Read Also: MS Dhoni: చేపల వ్యాపారంలోకి ఎంఎస్ ధోని

లంచ్ తర్వాత ఖవాజా, స్మిత్ లు స్లోగా బ్యాటింగ్ చేస్తూ భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. ముఖ్యంగా స్మిత్ 28 స్ట్రయిక్ రేట్ తో పరుగులు చేశాడు. భారత బౌలర్లకు వికెట్ తీసే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వలేదు. దాంతో రెండో సెషన్ లో భారత జట్టు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. అయితే మూడో సెషన్ లో భారత్ కు రెండు వికెట్లు దక్కాయి.జడేజా బౌలింగ్ లో స్మిత్ వికెట్ల మీదుగా ఆడుకోగా.. కాసేపటికే హ్యాండ్స్ కాంబ్( 17 )ను మహ్మద్ షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. వెంటవెంటనే రెండు వికెట్లు పడటంతో ఆస్ట్రేలియా శిబిరంలో ఆందోళన నెలకొంది. 81వ ఓవర్ వరకు కూడా భారత బౌలర్లు ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టేందుకు బౌలింగ్ చేశారు.

కానీ, 81వ ఓవర్ అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త బందిని తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ఇబ్బంది పడ్డ ఖవాజా, గ్రీన్ లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ముఖ్యంగా కెమరూన్ గ్రీన్ ఫోర్లతో విరుచుకుడ్డారు. చివరి తొమ్మిది ఓవర్లలో ఆస్ట్రేలియా ఓవరకు 7 పరుగుల కంటే ఎక్కువ రన్స్ సాధించింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో ఖవాజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత్ లో ఉస్మాన్ ఖవాజాకు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం.

Show comments