Site icon NTV Telugu

WHO: యువతలో పెరిగిన ఆల్కహాల్, ఈ-సిగరెట్ల వాడకం.. ఆందోళనలో డబ్ల్యూహెచ్ఓ

Who

Who

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) యూరోపియన్ శాఖ ఇవాళ (గురువారం) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. కౌమారదశలో ఉన్నవారిలో ఆల్కహాల్, ఈ-సిగరెట్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపింది. యూరప్, మధ్య ఆసియా, కెనడాలో 11, 13, 15 ఏళ్ల వయస్సు గల 2, 80,000 మంది యువకుల నుంచి సేకరించిన సర్వేలో వెల్లడైంది. ఈ పోకడల వల్ల యొక్క దీర్ఘకాలిక పరిణామాలు ఎదుర్కోనే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇందులో 15 ఏళ్లలోపు వారిలో 57 శాతం మంది కనీసం ఒక్కసారైనా మద్యం సేవించారని.. ఇక, అబ్బాయిలతో పోలిస్తే బాలికల సంఖ్య 59 శాతంగా ఉందని నివేదికలో పేర్కొంది.

Read Also: Suryapet Road Accident: ఆగివున్న లారీని ఢీ కొట్టిన కారు.. ఆరుగురు స్పాట్‌ డెడ్‌

ఇక, డబ్ల్యుహెచ్‌ఓ మొత్తం మద్యపానం అబ్బాయిలలో తగ్గింది.. కానీ, బాలికలలో అది పెరిగిందని పేర్కొంది. ప్రస్తుత వినియోగం విషయానికి వస్తే.. గత 30 రోజులలో కనీసం ఒక్కసారైనా తాగుతునట్లు వెల్లడైంది. 5 శాతం మంది బాలికలతో పోలిస్తే, 11 ఏళ్ల అబ్బాయిలలో ఎనిమిది శాతం మంది అలా చేసినట్లు నివేదించారు. కానీ, 15 సంవత్సరాల వయస్సులోని 38 శాతం మంది అమ్మాయిలు గత 30 రోజుల్లో కనీసం ఒక్కసారైనా మద్యం తాగినట్లు డబ్ల్యూహెచ్ఓ చెప్పుకొచ్చింది.

Read Also: Jonnavithula: ఎమ్మెల్యేగా పోటీకి దిగిన సినీ స్టార్

దీని వల్ల మద్యం నుంచి కలిగే హానితో పిల్లలు, యువకులను రక్షించడానికి మెరుగైన చర్యలు తీసుకోవాలని WHO యూరప్, మధ్య ఆసియాలోని అనేక దేశాలకు సూచనలు చేసింది. చిన్న వయస్సులోనే ఈలాంటి వ్యసనాలకు అలవాటు పడటం వల్ల అనేక దీర్ఘకాలిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. అదే సమయంలో, గంజాయి వినియోగం కొద్దిగా తగ్గింది.. దీన్ని కేవలం 15 ఏళ్ల వయస్సుకు చెందిన 12 శాతం మంది మాత్రమే వినియోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.

Exit mobile version