NTV Telugu Site icon

USA Based Companies : ఒకరు దుకాణం కట్టేశారు.. మరొకరు సారి చెప్పారు.. 24గంటల్లోనే భారత్ ముందు తలొంచిన అమెరికా దిగ్గజాలు

New Project (29)

New Project (29)

USA Based Companies : 24 గంటల్లోనే రెండు పెద్ద అమెరికన్ కంపెనీలు భారతదేశం ముందు తలవంచాయి. ఈ రెండు కంపెనీలు తమ తమ రంగాలలో దిగ్గజాలు. ఒకటి మార్క్ జుకర్‌బర్గ్ మెటా.. మరొకటి హిండెన్‌బర్గ్ రీసెర్చ్. ముఖ్యంగా మెటా జుకర్‌బర్గ్ ప్రపంచంలో భారతదేశం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేసింది.. హిండెన్‌బర్గ్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, అతని గ్రూపుపై నివేదికలను జారీ చేసింది. మెటా తన తప్పును గ్రహించి క్షమాపణలు చెప్పింది. అయితే హిండెన్‌బర్గ్ షట్టర్ మొత్తానికే క్లోజ్ అయింది. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం ప్రకటించారు.

ముందుగా హిండెన్‌బర్గ్ గురించి మాట్లాడుకుందాం. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత కొన్ని సంవత్సరాలుగా అదానీ గ్రూప్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. 2023లో ప్రచురించబడిన దాని నివేదిక అదానీ గ్రూప్ షేర్ ధరలను తారుమారు చేసిందని.. ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని ఆరోపించింది. అదానీ ఆ సమయంలో బిలియన్ల డాలర్ల నష్టాన్ని చవిచూశాడు. అయితే, అదానీ, అతని కంపెనీలు అతడి ఆరోపణలను ఖండించాయి. హిండెన్‌బర్గ్ ఒక అమెరికన్ పెట్టుబడి, పరిశోధన సంస్థ. అమెరికాలో అధికార బదిలీ జరగబోతున్న సమయంలో దానిని మూసివేయాలనే నిర్ణయం తీసుకున్నారు. నాథన్ ఆండర్సన్ దీనిని 2017 లో ప్రారంభించారు.

Read Also:CM Chandrababu: కడప జిల్లా పర్యటనకు సీఎం చంద్రబాబు..

ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ఆండర్సన్ తన అభిరుచులను కొనసాగించడానికి, ప్రయాణించడానికి, తన కాబోయే భార్య, వారి బిడ్డతో సమయం గడపాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తు కోసం తగినంత డబ్బులను ఆదా చేశానన్నారు. అతను తన డబ్బును తక్కువ ఒత్తిడి ఉన్న పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాడు.

మెటా క్షమాపణలు
2024 ఎన్నికల్లో ప్రస్తుత భారత ప్రభుత్వం ఓడిపోయిందంటూ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలకు ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా క్షమాపణలు చెప్పింది. కోవిడ్ మహమ్మారి తర్వాత 2024 ఎన్నికలలో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు ఓటమిని ఎదుర్కొన్నాయని జుకర్‌బర్గ్ ఒక పాడ్‌కాస్ట్‌లో అన్నారు. ఆయన ప్రకటనపై భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారతదేశం గురించి జుకర్‌బర్గ్ తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విమర్శించారు. జనవరి 13న ఎక్స్ లో ఒక పోస్ట్‌లో వైష్ణవ్ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి తర్వాత 2024 ఎన్నికలలో భారతదేశంతో సహా చాలా అధికార ప్రభుత్వాలు ఓటమిని ఎదుర్కొంటాయని జుకర్‌బర్గ్ చేసిన వాదన వాస్తవంగా తప్పు అని అన్నారు. దీని తర్వాత మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ శివనాథ్ తుక్రాల్ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన ప్రకటన భారత్ కు తప్ప మిగతా దేశాలకు వర్తిస్తుందని చెప్పారు. ఈ అనుకోకుండా జరిగిన పొరపాటుకు మేము క్షమాపణలు కోరుతున్నామని ఆయన అన్నారు.

Read Also:Maha Kumbh Mela 2025: కుంభమేళాపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్

Show comments