Site icon NTV Telugu

Largest Afro : జుట్టు పెంచింది.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టింది..

Long Hair

Long Hair

సరదా.. కొందరికి అనుకోకుండా గుర్తింపు తెచ్చి పెడుతుంది. అదే పనిగా ఆ పనిలో మునిగిపోతే. అయితే లూసియానాకు చెందిన 47 ఏళ్ల ఏవిన్ డుగాస్ జట్టుతో గిన్సిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు పది ఇంచు పొడవు ఆఫ్రో( ఆఫ్రికన్ స్టైల్ ) హెయిర్ స్టైల్ తో ఈమె ఇప్పుడు వార్తాలల్లో నిలిచింది. అయితే.. ఆమె గిన్సిస వరల్డ్ రికార్డు బద్దలు కొట్టడం ఇదే తొలిసారి కాదు.. 2010 సమయంలో.. నాలుగు ఫీట్ల జుట్టతోనూ ఆమె ఇలాగే రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు ఆ జట్టును మరింతగా పెంచి.. తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్నారామె. గత 24 ఏళ్లుగా ఆమె ఆ జట్టును అలాగే పెంచతోందట. అయితే మొదట్లో ఆమె జట్టు కోసం కెమికల్స్ వాడేదట..

Also Read : Bholaa: అందుకే అన్నింట్లో వేలు పెట్టకూడదు అంటారు…

అయితే అందులో చాలా వరకు ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని తర్వాతే ఆమెకు తెలిసిందట.. దీంతో అప్పటి నుంచి ఆమె సహజ పద్దతుల్లోనే జుట్టును పెంచుతూ వస్తోందామె. తన జుట్టుకోసం ఓ హెయిర్ స్టైల్ డిజైనర్ ను పెట్టుకున్నారామె.. కేవలం అంచులు కత్తిరించేందుకు మాత్రమే ఆమెను పిలిపించకుంటుందట. ఆ జుట్టు మెయింటెనెన్స కష్టంగా ఉన్నప్పటికీ.. ఇష్టంతోనే తాను ముందుకు వెళ్తున్నట్లు డుగాస్ చెప్తోంది. తన జుట్టును శాశ్వతంగా స్ట్రెయిట్ చేయడానికి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించడం వల్ల నేను అలసిపోయాను. ఆ రసాయనాలు ఇప్పుడు క్యాన్సర్‌తో ముడిపడి ఉన్నాయి అందుకోసమే సహజంగా జుట్టును పెంచుతున్నట్లు డుగాస్ వెల్లడించింది. ప్రజలు నా ఆఫ్రోకు భిన్నమైన ప్రతిచర్యలను కలిగి ఉన్నారు. కొందరు కేవలం ప్రశంసలతో కేకలు వేస్తారు, కొందరు తదేకంగా చూస్తారు, కొందరు దగ్గరకు వచ్చి ప్రశ్నలు అడుగుతారు అని ఏవిన్ డుగాస్ చెప్పుకొచ్చారు.

Also Read : Theif : మంచి దొంగ.. దొంగతనం చేసి తిరిగి తెచ్చి పెట్టేశాడు

Exit mobile version