NTV Telugu Site icon

Mother Harassing Daughter : టీనేజర్లకు గాలం వేసిన మహిళ.. ఆఖరికి కూతురిని కూడా వదల్లేదు

Cyber Criminals

Cyber Criminals

Mother Harassing Daughter: యునైటెడ్ స్టేట్స్‌లో ఒక మహిళ తన సొంత కుమార్తెతో సహా టీనేజ్ విద్యార్థులను నకిలీ పేరు, నంబర్‌తో వేధింపులకు గురిచేసింది. ఇందుకు ఆమెను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. 42 ఏళ్ల కెన్రా గెయిల్‌ లికారీ అనే మహిళ తన సొంత కూతురిని, ఆమె బాయ్‌ప్రెండ్‌ని, క్లాస్‌మేట్స్‌ని వివిధ మెసేజ్‌లతో వేధింపులకు గురిచేసింది. ఆమె ఫేక్‌ ఐడింటిటీతో 2021 నుంచి ఆన్‌లైన్‌లో టీనేజర్లను ఇలా వేధించడం మొదలు పెట్టింది. వేధింపులు తాళలేక బీల్‌ సిటీ పబ్లిక్‌ స్కూల్స్‌ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఈ కేసును దర్యాప్తు చేసింది. విచిత్రమేమిటంటే సదరు మహిళ ఆ స్కూల్‌లోనే బాస్కెట్‌ బాల్‌ కోచ్‌గా పనిచేస్తోంది.

Read Also:Psycho woman : షాకింగ్.. 11వేల మందిని చంపిన 97ఏళ్ల వృద్ధురాలు

ఇసాబెల్లా కౌంటీ ప్రాసిక్యూటింగ్ అటార్నీ డేవిడ్ బార్బెరి మాట్లాడుతూ, సందేశాలకు జోడించిన ఐసీ చిరునామాలను ఉపయోగించి మహిళను ట్రాక్ చేసినట్లు తెలిపారు. ఐతే విచారణలో సదరు మహిళ ఫేక్‌ ఐడింటిలతో టీనేజర్లను లక్ష్యంగా వేధించే సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. తనను గుర్తుపట్టకుండా ఉండేలా సాఫ్ట్‌వేర్‌ను, వివిద ప్రాంతాల నెంబర్లను, కోడ్‌లను వినియోగించినట్లు తేలింది. సైబర్‌ పోలీసులు ఆమెను ఐపీ అడ్రస్‌ సాయంతో ఆమెను ట్రాక్‌ చేశారు. ఆమె తన కూతురికి లేదా ఆమె క్లాస్‌మేట్‌లకి పంపించిన సుమారు పదివేల టెక్స్ట్‌ మెసేజ్‌లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళపై ఐదు ఆరోపణలు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరపరిచారు. దీంతో ఆమె సైబర్‌ వేధింపులకు పాల్పడినందుకుగానూ పదేళ్ల పాటు జైలు శిక్ష, నేరాలను మార్పు చేసేందుకు ప్రయత్నించినందుకు మరో ఐదేళ్లు జైలు శిక్ష ఎదుర్కొటోంది. ఐతే ఆమె ప్రస్తుతం తాజాగా సుమారు రూ.నాలుగు లక్షల పూచీకత్తుతో బెయిల్‌పై విడుదలయ్యింది.