Site icon NTV Telugu

JD Vance: నా భార్య హిందూ… ఏదో ఒక రోజు క్రైస్తవంలోకి మారుతుందని ఆశిస్తున్నా..

Usha Chilukurijdvance

Usha Chilukurijdvance

JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ తన భార్య ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భార్య ఉష ఏదో ఒక రోజు తనలాగే క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌లో హత్యకు గురైన రాజకీయ కార్యకర్త చార్లీ కిర్క్ జ్ఞాపకార్థం బుధవారం రాత్రి మిస్సిస్సిప్పి విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో జె.డి. వాన్స్ మాట్లాడారు. పరస్పర గౌరవం, అవగాహనతో మతాంతర వివాహం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఆసక్తికరంగా, గతంలో దేవుడిని నమ్మని వాన్స్ క్రమంగా తన భార్య సహాయంతో క్రైత్సవాన్ని స్వీకరించినట్లు తెలిపారు. వాన్స్ తన మతపరమైన ప్రయాణం, అది తన కుటుంబ జీవితంపై చూపిన ప్రభావం గురించి ప్రసంగించారు.

READ MORE: Fake Notes: దేశంలో చెలామణి అవుతున్న నకిలీ కరెన్సీ రూ. 500 నోటు

తన భార్య ఉష గురించి వాన్స్ మాట్లాడుతూ.. ఆమె చాలా ఆదివారాలు తనతో చర్చికి వస్తుందని తెలిపారు. “నేను క్రైస్తవ మతాన్ని నమ్ముతాను. నా భార్య అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆమె అర్థం చేసుకోపోయినా పర్వాలేదు. ఎందుకంటే దేవుడు ప్రతి వ్యక్తికి వారి స్వంత మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇచ్చాడు. తన ఇద్దరు పిల్లలు క్రైస్తవ పాఠశాలలో చదువుతున్నారు. నా పెద్ద కుమారుడు గత సంవత్సరం తన మొదటి కమ్యూనియన్‌ను అందుకున్నాడు.” అని వాన్స్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వాన్స్ ప్రొటెస్టంట్ క్రైస్తవ కుటుంబంలో పెరిగాడు. కానీ చాలా కాలం పాటు తన దేవుడిని నమ్మలేదు. 2016లో ఆయన కాథలిక్కు మతంలోకి మారాలని భావించారు. 2019లో బాప్టిజం స్వీకరించారు. 2024లో తన భార్య ఉష ఈ ప్రయాణంలో తనకు ఎంతో మద్దతు ఇచ్చిందని వాన్స్ చెప్పారు.

READ MORE: PM Modi: ఐక్యతా విగ్రహం దగ్గర వల్లభాయ్ పటేల్‌కు మోడీ నివాళి

అయితే.. ఉషా చిలుకూరి అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1970ల్లోనే అమెరికాకు వలస వెళ్లారు. వీళ్ల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు. యేల్‌ లా స్కూల్‌లో ఉషా, జేడీ వాన్స్‌ తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ఇష్టపడి.. 2014లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. భర్త విజయంలో ఉష కీలక పాత్ర పోషించారు.

Exit mobile version