Site icon NTV Telugu

Heart Attack: బాస్కెట్‌బాల్‌ ఆడుతుండగానే గుండెపోటు.. విద్యార్థి మృతి

Heart Attack

Heart Attack

Heart Attack: ఇటీవల చిన్నా పెద్దా లేకుండా గుండె సంబంధ వ్యాధులతో జనాలు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. బాస్కెట్‌బాల్‌ ఆడుతూనే ఓ పాఠశాల విద్యార్థి ప్రాణాలు కోల్పోయిన ఘటన అగ్రరాజ్యమైన అమెరికాలో చోటుచేసుకుంది. నార్త్ వెస్ట్రన్ హైస్కూల్‌కు చెందిన పద్దెనిమిదేళ్ల కార్టియర్ వుడ్స్ హఠాత్తుగా బాస్కెట్‌బాల్ ఆడుతూ జనవరి 31వ తేదీన మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. జనవరి 31 నుంచి హెన్రీ ఫోర్డ్ హాస్పిటల్‌లో లైఫ్‌ సపోర్టులో ఉన్నాడు. అతను డగ్లస్ హై స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అతని కోసం పెద్ద సంఖ్యలో స్నేహితులు, కుటుంబ సభ్యులు యువకుడి కోసం ప్రార్థనలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది.

Sister Saves Brother: సిరియా భూకంపం.. తమ్ముడిని కాపాడిన అక్క

ఆ విద్యార్థి బాస్కెట్‌బాల్‌ కోర్టులో గుండెపోటుతో కుప్పకూలిన వెంటనే కోచ్‌ అతనికి సీపీఆర్‌ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అలా చేయలేక.. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా అతని ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. విద్యార్థి మృతితో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. డెట్రాయిట్ పబ్లిక్ స్కూల్స్ కమ్యూనిటీ డిస్ట్రిక్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. యువకుడి మరణంతో తాము హృదయవిదారకంగా ఉన్నామని పేర్కొంది.

Exit mobile version