పహల్గామ్ ఉగ్రదాడి.. ఆ తర్వాత దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. రాత్రి కాగానే డ్రోన్లు, క్షిపణులతో భారత్‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ జరుపుతున్న దాడులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. మరోవైపు.. సరిహద్దుల్లో కాల్పులకు కూడా గట్టిగా బదులిస్తోంది. అదే సమయంలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు భీకరదాడులకు దిగాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి.
READ MORE: Lava Agni 3: లిమిటెడ్ ఆఫర్.. లావా అగ్ని 3 పై ఏకంగా రూ. 5000 వరకు తగ్గింపు.!
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్- పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వం వహించిందని స్పష్టం చేశారు. సుదీర్ఘ చర్చల తరువాత.. భారతదేశం, పాకిస్థాన్ పూర్తి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో తాను సంతోషిస్తున్నట్లు తెలిపారు. కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినందుకు రెండు దేశాలకు అభినందనలు తెలుపుతున్నట్లు సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు.. ఈ విషయంలో ఇరు దేశాలకు ధన్యవాదాలు తెలిపారు.
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
