Khamenei: “1981లో పునర్జన్మ.. 2026లో చావు”.. శనివారంతో ఖామెనీకి విడదీయలేని బంధం.. కట్‌చేస్తే అదే రోజున చావు!.
Khamenei: మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితులు దారుణంగా మారాయి. అమెరికా-ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడితో మధ్యప్రాచ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో ఇప్పటికే ఖామేనీ మరణించిన విషయం తెలిసిందే. ఇరాన్ రాజకీయ చరిత్రలో శనివారం ఒక విషాద మలుపుగా నిలిచిపోయింది. దాదాపు నలభై ఏళ్ల పాటు దేశాన్ని నడిపించిన అత్యున్నత మత నాయకుడు అయతుల్లా అలీ ఖామెనీ అనంత లోకాలకు చేరుకోవడం ఆ దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. అలీ ఖామెనీ వయస్సు 86 ఏళ్లు. 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ మధ్యలో అధ్యక్షులు మారాయి. ప్రభుత్వాలు సైతం మారాయి. ఏ ప్రభుత్వం వచ్చినా తుది నిర్ణయం ఆయనదే. విదేశాంగ విధానాల నుంచి అణు కార్యక్రమం వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నది ఖామెనీ. అయితే.. ఆయన జీవితంలో శనివారానికి ప్రత్యేక స్థానం ఉంది. 1981లో ప్రజా సభలో జరిగిన బాంబు దాడిలో ఖామెనీ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనలో కుడి చేయి శాశ్వతంగా పని చేయకుండా మారింది. ఆ ఏడాదిలో ఇరాన్ అధ్యక్షుడిగా రెండోసారి పదవి చేపట్టారు. అయితే.. ఆయన ప్రాణాలతో బయటపడినది ఓ శనివారం.. నిన్న ఇజ్రాయెల్- అమెరికా దాడిలో మరణించింది సైతం శనివారమే కావడంతో ఈ అంశంపై ప్రస్తుతం విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అదే రోజు, జీవితానికి ముగింపు పలకడం చరిత్రలో విచిత్రమైన సంఘటనగా మిగిలిపోయింది.
READ MORE: Israel-Iran War: యూఎస్-ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు మృతి..
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఇక మరోవైపు.. ఖామెనీ మరణంతో ఇరాన్‌లో రాజ్యాంగ ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత, కొత్త సుప్రీం లీడర్‌గా సీనియర్ మతాధికారి ఆయతొల్లా అలిరేజా అరాఫీని నియమించినట్లు ఆ దేశ వార్తా సంస్థ వెల్లడించింది. తాత్కాలిక సుప్రీం లీడర్‌గా కొనసాగుతారని వెల్లడించింది. ఇరాన్ రాజ్యాంగ ప్రక్రియలో వారసుడిని ఎన్నుకునే వరకు, సుప్రీం లీడర్‌గా విధులు బాధ్యత కలిగిన తాత్కాలిక నాయకత్వ మండలిలో అయతుల్లా అలిరేజా అరాఫీని తాత్కాలిక అత్యున్నత నాయకుడిగా నియమించారు.
READ MORE: Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!