Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Us Iran War Pentagon Precision Gravity Bombs Explained

Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!

Published Date :March 5, 2026 , 3:10 pm
By Shiva Ganesh
Gravity Nuclear Bombs: ఇరాన్ నామరూపాలు లేకుండా చేసేందుకు అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Gravity Nuclear Bombs: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) అధిపతి పీట్ హెగ్సెత్ తాజాగా చేసిన ప్రకటన ఇరాన్ విషయంలో అమెరికా ఎంత కఠినంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇరాన్‌పై గెలుపు దిశగా అమెరికా అడుగులు వేస్తోందని, త్వరలోనే శత్రువుల ఉనికి ప్రశ్నార్థకం కానుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా – ఇజ్రాయెల్ దళాలు వచ్చే వారం రోజుల్లోపే ఇరాన్ గగనతలంపై పూర్తి నియంత్రణ సాధించబోతున్నాయని హెగ్సెత్ వెల్లడించారు.

ఇప్పటికే బలహీనపడిన ఇరాన్ దళాలపై అమెరికా తన అదనపు బలగాలను ప్రయోగిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న దాడులు కేవలం ప్రారంభ దశ మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని భారీ దాడులు జరగనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మిషన్ కోసం అమెరికా తన వద్ద ఉన్న ‘అన్‌లిమిటెడ్ ప్రెసిషన్ గ్రావిటీ బాంబుల’ను వినియోగించేందుకు సిద్ధమైంది. ఇంతకీ ఈ బాంబుల ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

Also Read

  • Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.
  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.
  • Bengal's Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..
  • Vijay-Governor: కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న విజయ్
Add as a preferred
source on google

అసలు ఏమిటీ ‘గ్రావిటీ బాంబులు’ ?
గ్రావిటీ న్యూక్లియర్ బాంబులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, ప్రమాదకరమైన ఆయుధాలని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. వీటిని ‘ఫ్రీ-ఫాల్ న్యూక్లియర్ బాంబులు’ అని కూడా పిలుస్తారని చెబుతున్నారు. మిసైళ్లలా కాకుండా, వీటిని యుద్ధ విమానాల నుంచి కిందకు వదులుతారు. ఇవి కేవలం గ్రావిటీ, విమానం వేగంపై ఆధారపడి లక్ష్యం వైపు దూసుకెళ్తాయి. అణు యుగం స్టార్టింగ్‌లో పుట్టిన ఈ ఆయుధాలు, నేడు అధునాతన థర్మోన్యూక్లియర్ డివైజ్‌లుగా పరిణామం చెందాయి. ఇవి అన్‌గైడెడ్ (మామూలు) వెర్షన్లతో మొదలై ఇప్పుడు అత్యంత కచ్చితత్వంతో కూడిన ఆయుధాలుగా మారాయి.

ఎలా పని చేస్తాయంటే..
ఈ బాంబుల విధ్వంసక శక్తి వెనుక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవి ప్రధానంగా రెండు ప్రక్రియల ద్వారా పనిచేస్తాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి.

1. ఫిషన్ & ఫ్యూజన్
చాలా వరకు గ్రావిటీ బాంబులు థర్మోన్యూక్లియర్ రకానికి చెందినవి. ఇవి శక్తిని విడుదల చేయడానికి రెండు దశలను ఉపయోగిస్తాయి.

ఫిషన్: యురేనియం-235 లేదా ప్లూటోనియం-239 వంటి పరమాణువులను విడగొట్టడం ద్వారా అపారమైన ఉష్ణోగ్రత, పీడనం విడుదల అవుతుంది.

ఫ్యూజన్: ఫిషన్ ద్వారా వచ్చిన వేడిని ఉపయోగించి హైడ్రోజన్ ఐసోటోపులను (డ్యూటీరియం, ట్రిటియం) కలిపి మరింత భారీ ఎనర్జీని రిలీజ్ చేస్తారు. ఇది సాధారణ అణు బాంబు కంటే కొన్ని వందల రెట్లు శక్తివంతమైనది.

2. ‘డయల్-ఏ-యీల్డ్’ టెక్నాలజీ
ఆధునిక గ్రావిటీ బాంబుల్లో ఉన్న మరో విశేషం ఏమిటంటే, వాటి విధ్వంసక తీవ్రతను అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. దీనినే ‘డయల్-ఏ-యీల్డ్’ అంటారు. అంటే యుద్ధ అవసరాలను బట్టి తక్కువ డ్యామేజీ లేదా భారీ విధ్వంసం కలిగించేలా వీటిని సెట్ చేయవచ్చు.

అమెరికా తన అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని రంగంలోకి దించడం ద్వారా ఇరాన్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసింది. రాబోయే కొద్ది రోజులు మధ్యప్రాచ్య రాజకీయాల్లో, యుద్ధ స్థితిగతుల్లో అత్యంత కీలకం కానున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • B61 Nuclear Bomb
  • Gravity Nuclear Bombs
  • Israel Iran Conflict News
  • Middle East conflict 2026
  • Middle East Conflict Today

తాజావార్తలు

  • Akhilesh Yadav: ఐప్యాక్‌తో అఖిలేష్ యాదవ్ తెగదెంపులు.. నమ్మకం పోయిందా? భయం పట్టుకుందా?

  • Tamil Nadu: విజయ్ ప్రమాణ స్వీకార వేడుకకు రాహుల్ గాంధీకి ఆహ్వానం.

  • Viral: నైట్ కు వస్తావా..? రేట్ ఎంత..? అర్ధరాత్రి బస్టాండ్ వద్ద సీపీతో బేరం ఆడిన పోకిరీలు.

  • MAA: ‘మా’ పేరుతో మోసాలు.. నకిలీ సంఘాలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సీరియస్ వార్నింగ్!

  • Bengal’s Next CM: బెంగాల్‌లో మే 9న బీజేపీ ప్రభుత్వం.. సువేందుకే సీఎంగా ఛాన్స్..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions