Threat Of Hurricane: అమెరికాలో మిల్టన్ హరికేన్ కారణంగా విధ్వంసం సంభవించే అవకాశం ఉంది. తుఫాను మంగళవారం ఫ్లోరిడాలోని టంపా బే తీరం వైపు దూసుకుపోతోంది. తుఫాను దృష్ట్యా, ఫ్లోరిడాలోని పరిపాలన తీర ప్రాంతాలను ఖాళీ చేయమని ప్రజలను ప్రభుత్వం ఆదేశించింది. 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. హెలెన్ హరికేన్ విధ్వంసం సృష్టించిన రెండు వారాల తర్వాత భారీ తుఫాను వచ్చింది. హరికేన్ మిల్టన్ బుధవారం తీరాన్ని తాకవచ్చు. ఇది ఫ్లోరిడాలో జనసాంద్రత కలిగిన పశ్చిమ తీరానికి ముప్పును కలిగిస్తుంది. పశ్చిమ-మధ్య ఫ్లోరిడాను తాకిన అత్యంత విధ్వంసకర హరికేన్‌లలో మిల్టన్ ఒకటి అని యుఎస్ నేషనల్ హరికేన్ సెంటర్ తెలిపింది. టంపా బేకు ఉత్తర, దక్షిణ తీరప్రాంతం వెంబడి 10 నుండి 15 అడుగుల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉంది.
Gold Rate Today: పండగ వేళ శుభవార్త.. తులం బంగారంపై ఏకంగా 760 తగ్గింది! భారీగా పడిపోయిన వెండి
ఈ నేపథ్యంలో 127 – 254 మిమీ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో వరద ముప్పు కూడా పొంచి ఉంది. దాదాపు 900 దేశీయ, అంతర్జాతీయ విమానాలు ఆలస్యం అయ్యాయి. దాదాపు 700 విమానాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు జో బిడెన్ తన అక్టోబర్ 10 నుండి 15 జర్మనీ, అంగోలా పర్యటనను వాయిదా వేసినట్లు వైట్ హౌస్ మంగళవారం తెలిపింది.
ఫ్లోరిడాలో మిల్టన్ హరికేన్ రాకముందే వెంటనే ఖాళీ చేయాలని ప్రజలను అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కోరారు. ఇది జీవన్మరణ సమస్య అని బిడెన్ అన్నారు. ఇది ఒక శతాబ్దానికి పైగా ఫ్లోరిడాను తాకిన చెత్త హరికేన్ కావచ్చు. అలా జరగకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. కానీ., ప్రస్తుతం ఇలా అనిపిస్తోంది అంటూ బిడెన్ ఫ్లోరిడాలో అత్యవసర ప్రకటనలను జారీ చేసారు.