US Baghdad Drone Strike: ఇరాన్‌పై అమెరికా ప్రతీకారం.. హిజ్బుల్లా కమాండర్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Baghdad Drone Strike: ముగ్గురు సైనికుల మరణం తర్వాత ఇరాన్ అనుకూల మిలీషియాపై అమెరికా రక్తపాత దాడులను కొనసాగిస్తోంది. తాజా దాడిలో, ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో డ్రోన్ దాడిలో కారులో ప్రయాణిస్తున్న ఇరాన్ అనుకూల ఖతైబ్ హిజ్బుల్లా టాప్ కమాండర్‌ను అమెరికా చంపేసింది. హిజ్బుల్లా కమాండర్‌పై ఈ దాడికి అమెరికా తన రహస్య AGM-114R9X హెల్ఫైర్ క్షిపణిని ఉపయోగించిందని సమాచారం. ఈ క్షిపణితో అమెరికా అల్‌ఖైదా నాయకుడు అమాన్ అల్ జవహిరిని హతమార్చింది. ఈ క్షిపణికి కత్తిలా కనిపించే బ్లేడ్‌ను అమర్చినట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిన చిత్రాలు చూపిస్తున్నాయి. ఇరాక్‌లోని మిలిటెంట్ల స్థావరాలపై బుధవారం జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మద్దతున్న ఓ కీలక కమాండర్ హతమైనట్లు అమెరికా సైన్యం ప్రకటింది. జోర్డాన్‌లో ఇటీవల ముగ్గురు అమెరికా సైనికుల మరణానికి ప్రతీకారంగానే తాము ఈ దాడి చేశామని వివరించింది.
Read Also: Bomb Threats: చెన్నైలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. తల్లిదండ్రుల పరుగులు
Also Read
- KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
- Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
యూఎస్ దళాలపై దాడికి ప్రణాళిక, దాడికి కతైబ్ హిజ్బుల్లా కమాండర్ ప్రత్యక్ష బాధ్యత వహిస్తారని యూఎస్ మిలిటరీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో పౌరులెవరూ చనిపోలేదని అమెరికా తెలిపింది. ఈ ఘటనలో సామాన్య పౌరులు మరణించిన ఆనవాళ్లు లేవని ఓ సైనికాధికారి వెల్లడించారు. కేవలం కారు మాత్రమే దగ్ధమైనట్లు చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బహుశా ఆర్9ఎక్స్ అనే హెల్ఫైర్ రకం క్షిపణిని ఉపయోగించి ఉంటారని ఓ అమెరికా మాజీ సైనికాధికారి తెలిపారు. పేలుడు తీవ్రత ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 2020లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కీలక కమాండర్ ఖాసీమ్ సులేమానీని సైతం అమెరికా ఇదే తరహాలో హతమార్చింది.
Read Also: Pakistan Elections 2024: పాక్‌లో కొనసాగుతున్న పోలింగ్.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
రహస్య క్షిపణి గురించి అమెరికా చెప్పలేదు..
ది డ్రైవ్ నివేదిక ప్రకారం.. అమెరికా R9X క్షిపణిని ఉపయోగించింది. దానికి బ్లేడ్లు జోడించబడ్డాయి. సరిగ్గా అలాంటి దాడుల కోసమే ఈ క్షిపణిని రూపొందించారు. అందులో అమర్చిన బ్లేడ్ కారులో లేదా ఇతర వాహనంలో కూర్చున్న లక్ష్యాన్ని చంపేస్తుంది. ఇది పరిసరాలకు చాలా తక్కువ నష్టం కలిగిస్తుంది. బరాక్ ఒబామా హయాంలో ఈ క్షిపణి తయారు చేయబడింది. ఈ క్షిపణి విషయంలో అమెరికా ఇంకా మౌనంగానే ఉంది. యూఎస్ మిలిటరీ అనేక ఇతర రకాల హెల్ఫైర్ క్షిపణుల ఉనికిని బహిరంగంగా అంగీకరించింది. ఈ క్షిపణులను డ్రోన్ల నుంచి మాత్రమే ప్రయోగిస్తారు. దీనిని అమెరికన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్స్ లేదా CIA నిర్వహిస్తుంది. ఈ క్షిపణి సాయంతో అమెరికా ఇప్పటి వరకు అల్ ఖైదాతో పాటు పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నివేదిక ప్రకారం, 2022 సంవత్సరంలో, సీఐఏ ఈ క్షిపణి ద్వారా అల్ ఖైదా టాప్ కమాండర్ అమాన్ అల్ జవహిరిని చంపింది.
తాజావార్తలు
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!