Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో ఒక డాక్టర్ చేసిన ఘోర తప్పిదం వల్ల ఒక ప్రాణం పోయింది. అసలు విషయం ఏమిటంటే, రోగికి ఆపరేషన్ చేసి ‘ప్లీహం’ (Spleen) తీసేయాల్సింది పోయి, డాక్టర్ పొరపాటున ‘కాలేయం’ (Liver) తీసేశాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి డాక్టర్ థామస్ షాక్నోవ్స్కీపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
బిల్ బ్రయాన్ అనే వ్యక్తి 2024 ఆగస్టులో అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అతనికి ప్లీహం తొలగించాలని డాక్టర్ షాక్నోవ్స్కీ చెప్పారు. అయితే, తనకు ఆపరేషన్ వద్దు, తన సొంత రాష్ట్రమైన అలబామాకు వెళ్లి చికిత్స చేయించుకుంటానని బ్రయాన్ మూడు రోజుల నుంచి అతడికి చెబుతూనే ఉన్నాడు. కానీ, డాక్టర్ ఒత్తిడి చేయడంతో చివరికి ఆయన ఆపరేషన్‌కు ఒప్పుకున్నారు.
Also Read
- ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
- Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
ఆపరేషన్ గదిలో ఏం జరిగింది..
ఆపరేషన్ సమయంలో డాక్టర్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అవయవాలు సరిగ్గా కనిపించకపోయినా, తోటి సిబ్బంది సాయం తీసుకోకుండా తప్పుడు అవయవాన్ని కోసేశారు. దీనివల్ల బ్రయాన్ ఒంట్లో రక్తం అంతా పోయి.. ఆపరేషన్ టేబుల్ మీదనే ప్రాణాలు విడిచారు. విచిత్రం ఏమిటంటే.. తాను తీసిన కాలేయాన్ని చూపిస్తూ అది ప్లీహమే అని అక్కడి సిబ్బందిని నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ, అది కాలేయమని గుర్తించిన సిబ్బంది డాక్టర్ చేసిన పనికి షాక్ తిన్నారు.
సాధారణంగా కాలేయం, ప్లీహం అనేవి శరీరంలో వేర్వేరు చోట్ల ఉంటాయి. వాటి రంగు, ఆకారం కూడా చాలా భిన్నంగా ఉంటాయి. అంత చిన్న తేడాను డాక్టర్ గుర్తించకపోవడం పెద్ద నేరమని అధికారులు తేల్చారు. ఈ ఘటన తర్వాత ఫ్లోరిడా రాష్ట్రం ఆ డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేసింది. తాజాగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో నేరం రుజువైతే ఆయనకు దాదాపు 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. మే 19న ఈ కేసుపై కోర్టులో తదుపరి విచారణ జరగనుంది. ఒక వైద్యుడి బాధ్యతారాహిత్యం వల్ల ఒక కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
తాజావార్తలు
-
ShubmanGill vs Abhishek Sharma: అభిషేక్ శర్మ రివెంజ్.. శుభ్‌మన్ గిల్ షాక్.. వైరల్ వీడియో!
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!