US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Trade: అమెరికా విధించే భారీ టారిఫ్‌లు (పన్నులు) తప్పించుకోవడానికి చైనా ఆడుతున్న ఒక పెద్ద డ్రామాను అమెరికా తాజాగా బయటపెట్టింది. చైనా తయారుచేసిన ఉత్పత్తులను నేరుగా కాకుండా, వేరే దేశాల ద్వారా రూట్ మార్చి అమెరికాలోకి పంపుతున్నారని ఒక నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. దీనికి “షాడో ట్రాన్స్-షిప్మెంట్ నెట్వర్క్” అని పేరు పెట్టిన అమెరికా, ఈ జాబితాలో భారతదేశంతో పాటు మరో 40కి పైగా దేశాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసింది. ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో “ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్” పేరిట విడుదల చేసిన ఈ నివేదిక అంతర్జాతీయ వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. 2018లో ట్రంప్ ప్రభుత్వం చైనీస్ వస్తువులపై ‘సెక్షన్ 301’ కింద భారీ టారిఫ్‌లను విధించిన తర్వాత ఈ అక్రమ రవాణా మరింత ఎక్కువైందని నవారో స్పష్టం చేశారు. ఈ విధంగా రూట్ మార్చి జరుగుతున్న అక్రమ వ్యాపార విలువ ఏటా దాదాపు $40 బిలియన్ల నుంచి ఏకంగా $303 బిలియన్ల వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఏళ్ల తరబడి కమ్యూనిస్ట్ చైనా తన ఉత్పత్తులను దాదాపు 40కి పైగా దేశాల ద్వారా రీ-లేబులింగ్, రీ-ప్యాకేజింగ్, రీ-ఇన్వాయిసింగ్ లేదా చిన్నపాటి ప్రాసెసింగ్ చేయించి, ఆ దేశాల్లో తయారైనట్లు రంగు పూసి అమెరికా మార్కెట్లలోకి చొరబెడుతోందని పీటర్ నవారో వివరించారు. ఈ అక్రమ నెట్‌వర్క్‌లో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామ్య దేశాలైన మెక్సికో, కెనడా, ఈయూ (యురోపియన్ యూనియన్), భారత్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు కూడా భాగమయ్యాయని ఆరోపించారు. చైనా కంపెనీలు చౌకైన కూలీలు, బలహీనమైన కస్టమ్స్ నిబంధనలు ఉన్న దేశాలను, ఫ్రీ ట్రేడ్ జోన్లను అడ్డుపెట్టుకుని తమ వస్తువులకు కొత్త “నేషనల్ ఆరిజిన్” ముద్ర వేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
Also Read
- Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
- India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
- Lucknow: ఛీ.. ఛీ.. చనిపోయిన కూడా వదల్లేదు.! తండ్రి మృతదేహంతో కొడుకు దారుణం.. వీడియో వైరల్.!
- WhatsApp Scam Alert: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇక, మోసగాళ్ల చెక్..!
ఈ నివేదికలో భారత్‌లోని పుణే-గుజరాత్-చెన్నై పారిశ్రామిక ప్రాంతాన్ని అమెరికా ప్రత్యేకంగా ప్రస్తావించింది. చైనాకు చెందిన పంప్‌లు, కంప్రెసర్లు ఈ భారతీయ రీజియన్‌లోకి వచ్చి, అక్కడ చిన్నపాటి మార్పులు చేసుకుని భారతీయ ఉత్పత్తులుగా అమెరికాలోకి అడుగుపెడుతున్నాయని అమెరికా వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల యుఎస్‌లోని సిన్సినాటి, డేటన్, కొలంబస్ వంటి ప్రాంతాల్లోని అమెరికన్ ఉత్పత్తుల విక్రయాలు దారుణంగా దెబ్బతింటున్నాయని నవారో ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఈ సవాలును తిప్పికొట్టేందుకు అమెరికా ఇప్పుడు కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) ఆయుధాన్ని రంగంలోకి దించుతోంది. “డిటెక్టివ్ బోర్డర్” అనే అత్యాధునిక AI సిస్టమ్‌ను అమెరికన్ కస్టమ్స్ విభాగంలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏఐ సిస్టమ్ ఉత్పత్తుల షిప్మెంట్ డేటా, ప్రయాణించిన మార్గాలు, ప్రొడక్ట్ క్లాసిఫికేషన్స్, కంపెనీల యాజమాన్య లింకులు, ఉత్పత్తి సామర్థ్యాలను నిశితంగా విశ్లేషిస్తుంది. ఏవి నిజమైన పెట్టుబడులో, ఏవి చైనా అక్రమ మార్గాల్లో పంపుతున్న వస్తువులో ఈ AI పక్కాగా గుర్తిస్తుంది. అంతేకాకుండా, ఇటువంటి అక్రమ షిప్మెంట్లను అడ్డుకుని, భారీ పెనాల్టీలు విధించడం మరియు ఆయా వస్తువులను అమెరికాలోకి రాకుండా శాశ్వతంగా నిషేధించడం ఈ సిస్టమ్ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
US Trade: చైనా ‘టారిఫ్ మోసం’ బయటపెట్టిన అమెరికా.. భారత్ పేరు ఎందుకు వచ్చింది?
-
Woman Head Constable Mu*rd*er: మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య.. భర్తపైనే అనుమానం..
-
India Independence: భారత్‌కు అర్ధరాత్రే ఎందుకు స్వాతంత్య్రం వచ్చింది?.. ఆగస్టు 15 వెనుక ఉన్న జ్యోతిష్య రహస్యం..
-
Instagram New Logo 2026: ఇన్స్టాగ్రామ్ కొత్త లోగో.. 10 సంవత్సరాల తర్వాత మార్పులు.. కొత్తగా ఏముంది?
-
IND vs SL 1st Test: తుది జట్టులో చోటు ఉండదు.. స్టార్ బ్యాటర్‌కు హెడ్ కోచ్ గంభీర్ వార్నింగ్!
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్.. 365 రోజులకు బదులుగా 412 రోజుల వ్యాలిడిటీ.! రోజుకు 2GB హై-స్పీడ్ డేటా కూడా..
-
IND vs SL: గిల్, రాహుల్, పంత్ కాదు.. అతడే సబ్ కాంటినెంట్‌కు కింగ్.. మొదటి టెస్టులో ఆడించాలి!
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!