Urvil Patel: విధ్వంసం.. 28 బంతుల్లోనే సెంచరీ
- సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో
- గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు.
- 28 బంతుల్లోనే సెంచరీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvil Patel: ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో గుజరాత్ క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉర్విల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. త్రిపుర క్రికెట్ జట్టుపై కేవలం 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. త్రిపుర అందించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పటేల్ ఇన్నింగ్స్ 35 బంతుల్లో 113 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 12 సిక్సర్లు బాదాడు. అతని టీ20 కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ కూడా. అతని సెంచరీ సాయంతో త్రిపురపై గుజరాత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 32 బంతుల్లో (2018)లో సెంచరీ సాధించిన రిషబ్ పంత్ రికార్డును 26 ఏళ్ల ఉర్విల్ బద్దలు కొట్టాడు.
Also Read: V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
Also Read
- Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
- 30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
- Ind W vs Eng W: ప్రపంచ కప్ ముందు భారత్ కు భారీ షాక్.. ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి.!
- నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
దింతో పటేల్ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో T20 క్రికెట్ చరిత్రలో రెండవ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ ఏడాది సైప్రస్‌తో జరిగిన టి20 అంతర్జాతీయ మ్యాచ్‌లో కేవలం 27 బంతుల్లో సెంచరీ చేసిన ఎస్టోనియా క్రికెట్ జట్టుకు చెందిన సాహిల్ చౌహాన్ మాత్రమే అతని కంటే ముందున్నాడు. ఈ జాబితాలో 30 బంతుల్లో సెంచరీ సాధించిన క్రిస్ గేల్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన త్రిపుర 20 ఓవర్లలో 155/8 స్కోరు చేసింది. త్రిపుర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ శ్రీదామ్ పాల్ 49 బంతుల్లో 57 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్ష్య ఛేదనలో పటేల్ సెంచరీతో 10.2 ఓవర్లలో గుజరాత్ విజయానికి అవసరమైన స్కోరు సాధించింది. గుజరాత్‌కు చెందిన పటేల్, ఆర్య దేశాయ్ తొలి వికెట్‌కు 150 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. ఇకపోతే, ముగిసిన IPL 2025 వేలంలో పటేల్‌ను ఏటీం కొనుగోలు చేయలేదు.
🏏🔥 Huge Congratulations to Gujarat CA Senior Men's Team! 🔥🏏
An outstanding performance to secure a brilliant 8-wicket victory over Tripura CA in the Syed Mushtaq Ali Trophy! 💪👏
The spotlight shines on Urvil Patel, who created history by smashing the fastest century in… pic.twitter.com/X7Mb90h2Dm
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) November 27, 2024
తాజావార్తలు
-
Excise Duty: వాహనదారులకు బంపర్ ఆఫర్.. ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ పూర్తిగా రద్దు చేసిన కేంద్రం!
-
2026 Audi Q7: సూపర్ ఫాస్ట్ SUV.. 4.8 సెకన్లలోనే 100 కిమీ వేగాన్ని అందుకునే 2026 Audi Q7
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
Jayam Ravi Case : పిల్లల పాఠశాల ఫీజు, నా భరణం ఏడాదిగా రవి ఇవ్వడం లేదు : ఆర్తి
-
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!