Urvashi Rautela: రిషబ్ చేరిన ఆస్పత్రి ఫొటోను పోస్ట్ చేసిన ఊర్వశి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela: ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రమాదానికి గురై గాయాలపాలైన కొన్ని గంటల తర్వాత ‘ప్రార్థిస్తున్నాను’ అని పోస్ట్ చేసిన ఊర్వశి రౌతేలా.. ఇప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ముంబైకి చెందిన కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రి ఫొటోను షేర్ చేసింది. కారు ప్రమాదంలో మోకాలు, చీలమండలో స్నాయువు గాయాల చికిత్స కోసం డెహ్రూడూన్ నుంచి ముంబైలోని అంధేరీలో గల ఆస్పత్రికి తరలించిన కొద్దసేపటికే ఈ పోస్ట్ చేయడం గమనార్హం. ఊర్వశి తన ఇన్‌స్టా పోస్ట్‌లో ఏమి రాయనప్పటికీ, ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని ఆమె చెప్పకనే చెప్పింది. డిసెంబర్ 30న ఢిల్లీ నుంచి తన స్వస్థలం రూర్కీకి వెళ్తున్న రిషబ్ పంత్ ఎన్‌హెచ్-58 హైవేపై అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోర కారు ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రిషబ్ ఒక్కడే కారులో ఉన్నాడు.
ఇదిలా ఉండగా.. రిషబ్ పంత్, ఊర్వశి రౌతేలా మధ్య సంబంధం గురించి చాలా పుకార్లు పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. 2018లో ఒక హోటల్ లాబీలో తనను కలవడానికి రిషబ్ పంత్ గంటల తరబడి వేచి ఉన్నాడని ఊర్వశి ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నప్పటి నుంచి రిషబ్ పంత్, ఊర్వశి డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు పుట్టుకొచ్చాయి. 2018లోనే ఊర్వశి, రిషబ్ ముంబైలోని అనేక ప్రసిద్ధ రెస్టారెంట్లు, పార్టీలు,ఈవెంట్‌లలో కనిపించడంతో వారు డేటింగ్‌లో ఉన్నారని పుకార్లు మొదలయ్యాయి. చాలా కాలం తరువాత అదే సంవత్సరం ఇద్దరూ వాట్సాప్‌లో ఒకరినొకరు బ్లాక్ చేసుకున్నారని నివేదికలు పేర్కొన్నాయి.2019లో రిషబ్ పుకార్లను తోసిపుచ్చాడు. స్నేహితురాలు ఇషా నేగితో తన సంబంధాన్ని ప్రకటించాడు. అతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇషాతో ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. ఆమె కోసం ఒక సందేశాన్ని రాశాడు, “నేను చాలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను సంతోషపెట్టాలనుకుంటున్నాను.” అంటూ ఇషాను ఉద్దేశించి రాసుకొచ్చాడు. దీంతో అవన్నీ పుకార్లని తేలిపోయింది.
Also Read
- New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
Aam Admi Party: రాజస్థాన్ ఎన్నికల్లోనూ ఆప్.. 200 స్థానాల్లో పోటీ చేసేందుకు కసరత్తు
గత వారం, రిషబ్ పంత్ కారు ప్రమాదం తర్వాత రౌతేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. అందులో వైట్ హార్ట్ ఎమోజి, వైట్ డోవ్ ఎమోజి, వరుస నక్షత్రాలతో పాటు ‘ప్రార్థిస్తున్నాను’ అని శీర్షిక పెట్టారు. ఈ సారి ఆస్పత్రి ఫొటో పెట్టింది. ఊర్వశి రౌతేలా ఏమీ రాయనప్పటికీ, ఆ సమయంలో తాను ముంబైలో ఉన్నానని నటి పేర్కొంది.

తాజావార్తలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
-
Sheikh Hasina: షేక్ హసీనా ప్రెస్‌మీట్‌పై బంగ్లాదేశ్ అభ్యంతరం.. భారత్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!