Uravakonda Theft: విచిత్ర దొంగ.. చోరీకి ముందు వెంకన్నకు నమస్కారం.. ఆ తర్వాత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఓ విచిత్రమైన చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేయడానికి దుకాణంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి.. ముందుగా అక్కడ ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి నమస్కరించాడు. అనంతరం ఏమీ జరగనట్టుగా కుర్చీలో కూర్చొని నగదు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని బిగ్ బజార్ దుకాణంలో గత నెల 31న రాత్రి చోరీ జరిగింది. షట్టర్ను ధ్వంసం చేసిన దొంగ లోపలికి ప్రవేశించాడు. క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని చూసిన అతడు.. ముందుగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న కుర్చీలో దర్జాగా కూర్చొని.. నగదు తీసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. దొంగ క్యాష్ కౌంటర్ నుంచి సుమారు రూ.30 వేల నగదుతో పాటు మరికొన్ని వస్తువులను ఎత్తుకెళ్లినట్లు దుకాణ యజమాని తెలిపాడు. దొంగతనం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి నిందితుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
సాధారణంగా దొంగతనానికి వచ్చిన వ్యక్తులు తొందరగా నగదు, విలువైన వస్తువులు తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంటారు. కానీ ఈ ఘటనలో దొంగ ముందుగా దేవుడి చిత్రపటానికి నమస్కరించి.. ఆ తర్వాత చాలా ప్రశాంతంగా దొంగతనానికి పాల్పడటం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయి.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!