New Aadhaar Update: ఆధార్ అప్డేట్.. సెంటర్‌కు వెళ్లకుండానే ఫోన్ నంబర్ మార్చుకోండిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వినియోగదారులకు ఒక గొప్ప శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఆధార్ కార్డులో మొబైల్ నంబర్ లేదా చిరునామా మార్చుకోవాలంటే ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగడం.. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడటం తప్పనిసరి ఉండేది. కానీ.. ఇప్పుడు ‘mAadhaar’ యాప్ ద్వారా ఈ పనులన్నీ ఇంటి నుంచే సులభంగా పూర్తి చేసుకోవచ్చు. ఈ కొత్త డిజిటల్ విధానం వల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.
మొబైల్ నంబర్ మార్చుకోవడం ఎలా?
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని, అందులో ‘అప్డేట్ మొబైల్ నంబర్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కొత్త నంబర్‌ను నమోదు చేసి, దానికి వచ్చే ఓటీపీ (OTP) ద్వారా ధృవీకరించుకోవాలి. ఆ తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ పూర్తి చేసి అభ్యర్థనను పంపాలి. అనంతరం యూఐడీఏఐ అధికారులు మీ వివరాలను పరిశీలించి అప్డేట్ను ఖరారు చేస్తారు. యాప్ ద్వారానే మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవచ్చు.
Also Read
- Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
- Congress: ‘‘బీజేపీని మెప్పించే వ్యాఖ్యలు వద్దు’’.. శశి థరూర్‌పై కాంగ్రెస్ ఫైర్..
- IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
చిరునామా మార్పు ప్రక్రియ..
అడ్రస్ మార్చుకోవాలనుకునే వారు యాప్‌లో లాగిన్ అయి ‘సర్వీసెస్’ విభాగంలోని ‘అడ్రస్ అప్డేట్’ ఫీచర్‌ను ఎంచుకోవాలి. మీ కొత్త చిరునామా వివరాలను నమోదు చేసి, దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను అప్లోడ్ చేయాలి. దీనికోసం నిర్ణీత రుసుము రూ. 75 చెల్లించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఆన్లైన్ సదుపాయం వల్ల పేపర్‌వర్క్ తగ్గుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉంటూ ఆధార్ కేంద్రాలకు వెళ్లలేని వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ స్థిరంగా ఉండేలా చూసుకుని.. సరైన పత్రాలతో ఈ ప్రక్రియను నిమిషాల్లో పూర్తి చేయవచ్చు. భారతదేశం డిజిటల్ సేవల దిశగా వేస్తున్న అడుగుల్లో ఇది ఒక కీలకమైన మార్పుగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Mephedrone Seized : బీబీనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత.. నలుగురు అరెస్ట్..!
-
Jharkhand Protest: JPSC పరీక్ష రద్దుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం.. CBI దర్యాప్తుపై విద్యార్థుల పట్టు
-
TFTDDA: తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి
-
AAA Cinemas : వైజాగ్‌లో బన్నీ కొత్త అడ్డా.. AAA మల్టీప్లెక్స్ గ్రాండ్ ఓపెనింగ్.!
-
DGP Anand : నక్సలిజం పోయింది.. ఇప్పుడు డేంజర్ ఇదే.. డీజీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!