NTV Telugu Site icon

UP: మహిళపై గ్యాంగ్ రేప్, బాధతో ఆత్మహత్య.. పోలీసులు ఏం చేశారంటే..?

Up

Up

ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌లో సామూహిక అత్యాచారానికి గురై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ఈ కేసును ఎఫ్‌ఐఆర్‌లో గ్యాంగ్ రేప్ కింద చేర్చడానికి పోలీసులు నిరాకరించారు. దానికి బదులుగా ఆత్మహత్యకు ప్రేరేపించే సెక్షన్‌లను జోడించారని మృతురాలి తండ్రి చెప్పాడు. దీంతో.. ఈ కేసుపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. అత్యాచార ఘటన ఆగస్టు 17న జరిగింది. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు ఊరి నుంచి బయటకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఓ పాఠశాల సమీపంలో పడేసి వెళ్లిపోయారు. కాగా.. బాధితురాలు తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పింది. దీంతో.. వెంటనే తండ్రి అక్కడికి చేరుకుని మహిళను ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం.. ఆ మహిళ తన కుటుంబానికి జరిగిందంతా చెప్పింది. అయితే.. కొన్ని గంటల తర్వాత బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.

Indra 4K: బద్దలు కొడుతుంది అనుకుంటే ‘మురారి’ని టచ్ చేయలేదుగా!

ఈ ఘటనపై తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అయితే పోలీసులు మాత్రం గ్యాంగ్ రేప్ కేసుకు బదులు, ఆత్మహత్య కేసు నమోదు చేశారని తండ్రి తెలిపాడు. కాగా.. గ్యాంగ్ రేప్ ఆరోపణలపై కేసు నమోదు చేయడానికి నిరాకరించిన సబ్ ఇన్‌స్పెక్టర్‌ను తన పోస్ట్ నుండి తొలగించారు. అంతేకాకుండా.. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు. కాగా.. ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని ఆగస్టు 19న అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మూడో నిందితుడిని మరుసటి రోజు అరెస్టు చేశారు.

Maharashtra polls: సీఎం పోస్టుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

అయితే.. అరెస్టు సమయంలో ఇద్దరు నిందితులు పోలీసు జీపులో నుండి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుల కాళ్లు విరిగిపోయాయి. మరొక నిందితుడిని అరెస్ట్ చేసేందుకు వెళ్తే.. తమపై కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. కాగా.. పోలీసులు జరిపిన ప్రతీకార కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ దేవ్ తెలిపారు. అనంతరం.. ముగ్గురు నిందితులను జైలుకు తరలించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని.. పోస్టుమార్టం నివేదిక, ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.