ఓ వ్యక్తి ఆర్థిక పరిస్థితి బాగోలేక రుణ వాయిదా(ఈఎంఐ) చెల్లించలేదు. దీంతో ఆ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగుల చేసిన దారుణం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగులు ఓ వ్యక్తి ఈఎంఐ చెల్లించలేదని అతడి భార్యను తీసుకెళ్లారు. వాయిదా చెల్లించి భార్యను తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బ్యాంకు ఉద్యోగుల వద్ద బందీగా ఉన్న భార్యను పోలీసులు విడిపించారు.…