UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Police: ఉత్తర ప్రదేశ్‌లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ (DGP) రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు.
READ ALSO: Ishaq Dar: యుద్ధం ఆపడానికి వెళ్లి భుజం విరగ్గొట్టుకున్న పాకిస్థాన్ ఉప ప్రధాని.. ఫొటోలకు ఫోజులిస్తూ..
Also Read
- ‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Wife Harassment: భార్య వేధిస్తుంది, మరణించే అనుమతి ఇవ్వండి..
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Shubman Gill Vs Vaibhav: వైభవ్ సూర్యవంశీ నరకం చూపిస్తాడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన శుభ్‌మన్ గిల్..
డీజీపీ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. ఈ అంశాలలో నేరుగా పోలీస్ రిపోర్టులు దాఖలు చేయడానికి వీలు లేదు. వరకట్నం వేధింపులు, గృహ హింస, పని ప్రదేశంలో లైంగిక వేధింపులు, భ్రూణహత్యలు, బాల కార్మిక వ్యవస్థ, చెక్ బౌన్స్ (NI Act), విదేశీ మారక ద్రవ్య ఉల్లంఘనలు, గాలి, నీటి కాలుష్యం, జంతు హింస, ఆహార కల్తీ, వినియోగదారుల మోసం (దీని కోసం FSSAI లేదా వినియోగదారుల ఫోరమ్‌ను సంప్రదించాలి), ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన, మానవ అవయవాల అక్రమ రవాణా, కేబుల్ టీవీ నెట్‌వర్క్ వివాదాలపై ఇకపై యూపీ పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరు.
కోర్టు జోక్యం ఎందుకంటే..
చట్టం ప్రకారం ఏ కేసులనైతే కేవలం కోర్టులోనే దాఖలు చేయాలో, వాటిని నేరుగా పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా FIRలు నమోదు చేయడం వల్ల కోర్టులో నిందితులకు సాంకేతిక కారణాలతో ప్రయోజనం కలుగుతోందని ధర్మాసనం చెప్పుకొచ్చింది. విచారణలో ఆటంకాలు కలగకుండా, బాధితులకు సరైన న్యాయం అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం అని వెల్లడించింది. మేజిస్ట్రేట్ వద్ద ఫిర్యాదు చేసినప్పుడు, ప్రాథమిక విచారణ తర్వాతే కేసు ముందుకు సాగుతుందని, దీనివల్ల తప్పుడు ఫిర్యాదులు తగ్గుతాయని చెప్పింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే ముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), దర్యాప్తు అధికారులు చట్టంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని డీజీపీ ఆదేశించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించే అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర నేరాలకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు.
READ ALSO: Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..