Hate Speech Bill: సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వాగితే జైలుకే.. అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hate Speech Bill: తెలంగాణ అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. స్పీకర్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేష పూరిత ప్రసంగాలకు చెక్ పడనుంది. మతం, కులం, లింగం లేదా ఇతర కారణాల వల్ల సమాజంలో విద్వేషం, అశాంతిని రేకెత్తించే ప్రసంగాలు, రచనలు లేదా సోషల్ మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టమే హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill). ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినమైన జరిమానాలు, జైలు శిక్షలు (7 ఏళ్ల వరకు) విధించడం, ఈ నేరాలను నాన్-బెయిలబుల్‌గా పరిగణించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. విద్వేష పూరిత ప్రసంగాలు మొదటి సారి రుజువు అయితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. శిక్షతోపాటు రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. ఇదే ఘటన మరోసారి పునరావృతమైతే జైలు శిక్ష పదేళ్లు, రూ. లక్ష జరిమానా విధిస్తారు.
READ MORE: 50 ఏళ్ల తర్వాత చంద్రుడి దిశగా మానవ యాత్ర.. NASA Artemis II mission సిద్ధం..!
Also Read
- Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
- Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
- 8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
- UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విద్వేష పూరిత ప్రకటనలు, ప్రసంగాలు సైతం పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇకపై సంఘం, సమూహం, సమావేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉండొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. మతం, జాతి, కులం, వర్గం, స్త్రీ, పురుష, లైంగిక, జన్మస్థలం, నివాసం, భాష, అశక్తత, తెగలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, ప్రసంగాలు ఉండొద్దని ఈ బిల్లును తీసుకొచ్చింది. మాటల ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మాధ్యమం/సాధనాల ద్వారా సమాచార మార్పిడి ఉన్నా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లు ద్వారా ఎలాంటి అసభ్యకర కంటెంట్, సందేశం, సమాచారం ఉంటే వాటిని తొలగించాలని ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇక మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా?, రెచ్చగొట్టే పోస్టులు చేసినా జైలు శిక్ష తప్పదు!
READ MORE: ఎండాకాలంలో చల్లటి న్యూస్.. Godrej 1.5 Ton ఇన్వర్టర్ ఏసీపై రూ. 13,000 భారీ డిస్కౌంట్..!
తాజావార్తలు
-
Bhagat Singh: నేటికీ భారత యువత నరనరాల్లో ప్రవహిస్తున్న విప్లవాగ్ని భగత్.. ఉరితాడును ముద్దాడిన వీరుడి కథ..
-
RBI Bank Holidays October 2026: అక్టోబర్‌లో బ్యాంకులకు వరుస సెలవులు.. దసరా, దుర్గాపూజ సెలవుల పూర్తి జాబితా
-
IND vs AFG: భారత్-అఫ్గానిస్థాన్ క్వార్టర్ ఫైనల్‌కు భారీ వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే ఏం జరుగుతుంది?
-
The Paradise : నష్టాల దిశగా ప్యారడైజ్.. సండే రోజు బిగ్ డ్రాప్
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
ట్రెండింగ్
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!