UP: టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP: ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఓ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG)తో వెళ్తున్న ఒక భారీ ట్యాంకర్ నియంత్రణ కోల్పోయి టోల్ బూత్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్యాంకర్ నుంచి ఒక్కసారిగా ఎల్పీజీ లీక్ అయ్యింది. ఇక వెంటనే మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జూన్ 26న ఉదయం 6:40 గంటల ప్రాంతంలో జరిగిన ఈ భయానక ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ (CCTV) ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ 24 సెకన్ల వీడియో దృశ్యాల ప్రకారం.. రెండు గ్యాస్ ట్యాంకర్లు టోల్ ప్లాజా వైపు వస్తుండగా, అందులో ఒక ట్యాంకర్ అకస్మాత్తుగా నియంత్రణ తప్పి డివైడర్‌ను ఢీకొంటూ నేరుగా టోల్ బూత్‌లోకి దూసుకెళ్లింది. వాహనం క్రాష్ అయిన వెంటనే ట్యాంకర్ నుంచి గ్యాస్ భారీగా లీక్ అయి, చూస్తుండగానే పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ ఆవరించింది. ఈ ప్రమాదంలో రేగిన మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే.. దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఆ అగ్నికీలలు స్పష్టంగా కనిపించాయి.
ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ఒక పోలీసు అధికారి.. మంటలను అదుపు చేయడానికి జిల్లాలోని అన్ని ఫైర్ బ్రిగేడ్ యూనిట్లను, స్థానిక సివిల్ పోలీసు సిబ్బందిని వెంటనే రంగంలోకి దించినట్లు తెలిపారు. ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ ధర్మేంద్ర దూబే (40)తో పాటు టోల్ ప్లాజా ఉద్యోగి ఆలోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ధాటికి టోల్ ప్లాజాలో పనిచేస్తున్న ఇతర సిబ్బంది కూడా తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమించి ఆసుపత్రిలో కన్నుమూశారు. ప్రమాదం జరిగిన తర్వాత టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు, కాసేపటి వరకు వాహనాలను ఎలాంటి రుసుము (టోల్ ఛార్జీలు) లేకుండానే ఉచితంగా దాటనిచ్చారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేయడానికి ఒక ప్రత్యేక సాంకేతిక బృందాన్ని (Technical Team) ఏర్పాటు చేశారు.
Also Read
- PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
- Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
- Hyderabad: ఘట్కేసర్లో విషాదం.. రైలు కిందపడి దంపతుల ఆత్మహత్య!
- EPFO కొత్త రూల్ .. PF డిపాజిట్‌పై కీలక మార్పు.. ఎవరికి లాభం?
उत्तर प्रदेश: कौशाम्बी जिले में मौत का टैंकर: LPG रिसाव के बाद आग का तांडव, 26 जून को धमाके से दहला था सिहोरी टोल प्लाजा, 4 की मौत, CCTV में कैद खौफनाक मंजर.. @Uppolice @igrangealld @deo__kaushambi @kpmaurya1 @kaushambipolice pic.twitter.com/RtoYMaaHZs
— Pavan dubey Kaushambi (@DubeyKaushambi) July 3, 2026
తాజావార్తలు
-
UP: టోల్ బూత్‌ను ఢీకొట్టి పేలిన గ్యాస్ ట్యాంకర్.. భయానక సీసీటీవీ ఫుటేజ్ వైరల్(వీడియో)
-
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
-
PMAY House Size Rules: PMAY కింద శాశ్వత ఇల్లు.. ఇంటి పరిమాణం ఎంత? ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు ఇవే
-
AB De Villiers: బీసీసీఐ పెద్ద తప్పు చేసింది.. టీమిండియా ఆలోచన సరైంది కాదు!
-
Fact Check: యూపీలో హిందూ మహిళ ఆరుగురి ముస్లిం వ్యక్తుల తలలు నరికిందా? వైరల్ వార్తలో నిజమెంత?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!