Viral Video: ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో అనేక చోట్ల పాముకాటులకు సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాము. వర్షాకాల సమయంలో నీటి ప్రవాహం వల్ల సర్పాలు ఒక చోట నుంచి మరొక చోటికి వెళుతూ ఉంటాయి. అలాంటి సమయాలలో ఒక్కోసారి సర్పాలు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి రావడం జరుగుతుంది. ఇలాంటి సమయంలో పాములు ఇళ్లల్లోకి లేదా కార్యాలయంలోకి, వాణిజ్య సముదాయాలలోకి వచ్చి అనేక ఇబ్బందులకు గురిచేస్తూనే ఉంటాయి. ఇలా ఎప్పుడైనా మనుషులు వాటిని గమనించకపోతే పాము కాట్లకు గురైన సంఘటనలు అనేకం సోషల్ మీడియాలో చూసే ఉంటాము. ఇకపోతే తాజాగా ఉత్తరప్రదేశ్లోని బహ్రయిచ్ కోదాహీ గ్రామంలో ఓ వ్యక్తిని పాము కాటేసింది.
Home Minister Anitha: యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ని పరామర్శించిన హోం మంత్రి
విషపూరితమైన పాము వ్యక్తిని కాటేయడంతో ఆ వ్యక్తి వెంటనే ఏమీ ఆలోచించకుండా.. దగ్గరలో ఉన్న ప్లాస్టిక్ సంచిని తీసుకొని తనను కరిచిన పాముని అందులో వేసుకొని నేరుగా దాన్ని తీసుకొని.. అతని చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్ళాడు. అయితే అక్కడ తీసుకోవచ్చిన పామును చూసి అక్కడ ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు. కాకపోతే., వైద్యులకు ఆ పాముని చూపించి ఆ పాము కరిచిందని., అందుకు సంబంధించిన ట్రీట్మెంట్ తనకు ఇవ్వాలని ఆ పాము ఉన్న సంచిని మళ్లీ తాడుతో కట్టేశాడు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళం ఎదురైన తర్వాత సంచి మళ్ళీ మూసి వేయడంతో అక్కడ పరిస్థితి సద్దుమణిగింది. ఆ తర్వాత వైద్యులు అతనికి సకాలంలో ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ పామును ఏం చేశారన్న విషయం మాత్రం తెలియ రాలేదు.
Uttar Pradesh: In Bahraich, a youth showed bravery after being bitten by a snake by transporting the venomous snake in a bag to the hospital. Doctors were alarmed to find the snake in the bag. They promptly treated the youth, saving his life. The incident occurred in Kodahi… pic.twitter.com/lbyNRkX4Zl
— IANS (@ians_india) July 13, 2024