Viral Wedding: ముచ్చటగా ఒకేసారి ముగ్గురు అక్కాచెల్లెళ్లను పెళ్లాడిన యువకుడు.. ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Wedding: ఈ రోజుల్లో ఒక్క పెళ్లాంతోనే ఏగలేక సగటు మొగుళ్లు తలలు పట్టుకుంటున్నారు.. కానీ.. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా ధోరియా గ్రామానికి చెందిన ఓ పుణ్యాత్ముడు ఏకంగా ముగ్గురు అక్కాచెల్లెళ్లను ఒకేసారి మనువాడి సోషల్ మీడియాలో రచ్చ లేపాడు! రమేష్ వృతి రీత్యా రైతు. పట్టీలైన సరోజ్, సావిత్రి, సంతోషలను చాముండా ఆలయ హవన్ వేదిక ముందు అగ్నిసాక్షిగా ఆ వీరుడి పెళ్లాడాడు. వాళ్ల మెడలో పూలమాలలు వేసి, ఏడడుగులు నడిచాడు. నవ వధువులు తమ భర్త పాదాలకు నమస్కరించారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొదటి వీడియో చూసి ఇదేదో ప్రాంక్ ఆర్టిస్టుల రచ్చలే అని నెటిజన్లు తేలిగ్గా తీసుకున్నారు. కానీ.. తాము చేసుకున్నది నిజమైన పెళ్లేనని నిర్ధారిస్తూ మరో రీల్ ద్వారా వాళ్లు క్లారిటీ ఇచ్చారు.
ఈ ఘటనతో పలు కొత్త వివాదాలు చోటుచేసుకున్నాయి. హసన్పూర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ ఛైర్మన్ కూడా ఈ వీడియోలో దంపతులతో కలిసి కనిపించడం కలకలం రేపగా, ఛైర్మన్ ముగ్గురి పెళ్లికి హాజరుకావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తమ ఆలయ ప్రాంగణంలో ఎలాంటి వివాహ వేడుక జరగలేదని చాముండా ఆలయ పూజారులు స్పష్టం చేశారు. ఈ పెళ్లిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ వివాహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సమర్థిస్తుండగా.. ఫాలోవర్లు దీనిని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ వివాదం పెద్దదవ్వడంతో ఆ ముగ్గురు సోదరీమణులు, ఆ యువకుడు ప్రస్తుతం మీడియా ముందుకు రావడానికి నిరాకరిస్తున్నారు. కాగా, ఇటీవలె ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఖాతాలు ప్రారంభించిన ఈ సోదరీమణులు కేవలం 27 వీడియోలతోనే లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకుని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా మారారు. ప్రస్తుతం ఈ సంచలనంపై ఇరు కుటుంబాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!