Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heart Attack: గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. పాఠశాల ముగియడంతో పిల్లలందరూ ఆనందంగా ఇళ్లకు బయలుదేరారు. తమ వాహనాలు ఎక్కి సందడి చేస్తున్నారు. ఈ-రిక్షా డ్రైవర్ కూడా ఎప్పటిలాగే పిల్లలను ఎక్కించుకుని బయలుదేరేందుకు సిద్ధమయ్యాడు. అందరూ వచ్చారు కానీ, ఏడో తరగతి చదువుతున్న 13 ఏళ్ల కునాల్ శర్మ మాత్రం బయటకు రాలేదు. కాసేపట్లో వస్తాడేమోనని ఆ డ్రైవర్ దాదాపు 15 నిమిషాల పాటు వేచి చూశాడు. ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి, లోపలికి వెళ్లి వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పాఠశాల వాష్‌రూమ్ వద్దకు వెళ్లి చూడగా, అక్కడ దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కునాల్ అక్కడ స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు.
ఈ విషయాన్ని వెంటనే గమనించిన ఉపాధ్యాయులు, యాజమాన్యం తీవ్ర ఆందోళనతో కంగారుపడ్డారు. వెంటనే సమాచారం అందించి, తల్లిదండ్రులను పిలిపించి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. బాలుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ విషాదం ఆ కుటుంబాన్ని తీరని శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ విషాదకర సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా, మవానా పోలీస్ స్టేషన్ పరిధిలోని బసంత్ వ్యాలీ పబ్లిక్ స్కూల్లో చోటుచేసుకుంది. మవానా ప్రాంతంలోని కాబిలీ గేట్, కళావదా రోడ్డుకు చెందిన ధర్మేంద్ర శర్మ కుమారుడే ఈ కునాల్ శర్మ. రోజూ లాగే సోమవారం ఉదయం కునాల్ నవ్వుతూ పాఠశాలకు వెళ్లాడు. రోజంతా తరగతులు సజావుగా సాగాయి. సాయంత్రం బెల్ కొట్టగానే పిల్లలంతా బయటకు వచ్చారు. కానీ, కునాల్ మాత్రం వాష్‌రూమ్‌లోనే పడిపోవడంతో ఈ ఘోరం వెలుగు చూసింది.
Also Read
- Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
- Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
- Steel Tap Cleaning Tips: జిడ్డుగా మారిన స్టీల్ ట్యాప్‌ల క్లీనింగ్‌కు బెస్ట్ చిట్కా.. 2 నిమిషాల్లో క్లీనింగ్
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరించారు. మవానా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ పంకజ్ లవానియా తెలిపిన వివరాల ప్రకారం, బాలుడు ఆకస్మికంగా గుండెపోటు (హార్ట్ ఎటాక్) రావడం వల్లే మరణించి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు పోయాయని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని, పోలీస్ ఫిర్యాదు ఇచ్చేందుకు కూడా నిరాకరించారని పోలీసులు తెలిపారు. దాంతో ఇందులో ఎలాంటి నేరపూరిత కోణం లేదని ప్రాథమికంగా స్పష్టమవుతోంది. ఉదయమంతా ఉత్సాహంగా ఉన్న కంటిపాప, సాయంత్రానికి శవమై తేలడంతో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. 13 ఏళ్ల చిన్న వయసులోనే గుండె ఆగిపోవడం, పాఠశాల వాష్‌రూమ్‌లో బాలుడు పడి ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపడమే కాకుండా పలు సందేహాలకు తావిస్తోంది. బాలుడి మృతికి గుండెపోటే కారణమా లేక మరేదైనా ఉందా అనేది పూర్తి వైద్య నివేదికల అనంతరమే స్పష్టమయ్యే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
BRS MLAs: కేటీఆర్, హరీశ్‌రావు సహా 14 మంది ఎమ్మెల్యేలపై కేసులు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి అరెస్ట్
-
Asian Games Cricket Schedule: ఆసియా క్రీడల క్రికెట్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్ 3న రెండు దేశాల్లో టీమిండియా మ్యాచ్‌లు!
-
Rohit Sharma: బుల్లితెరపై రోహిత్ శర్మ కొత్త ఇన్నింగ్స్!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!