బుధవారం కురిసిన అకాల వర్షం, ఈదురు గాలుల తాకిడి ఉమ్మడి కృష్ణా జిల్లా రైతాంగంపై పడింది ప్రధానంగా మైలవరం నియోజకవర్గంలో ములగ తోటలు పూర్తిగా నేలకొరిగాయి. ఎకరం రూ.40,000 ఖర్చుపెట్టి సాగు చేశామని.. ఇంకా చేతికి పంట రాకుండానే ములగ తోటలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైలవరంలో ఉన్నటువంటి నాలుగు నుంచి ఆరు గ్రామాల్లో ఇదేవిధంగా ములగ తోటలు ఈదురు గాలుల దెబ్బకి రైతులకు నష్టాలను తెచ్చాయి.
Also Read: Ajit Agarkar: నా పదవీకాలం పొడిగించండి.. బీసీసీఐని కోరిన అజిత్ అగార్కర్!
అకాల వర్షం కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొక్క జొన్న పంట పూర్తిగా నేలకొరిగింది. 110 రోజులు పండాల్సిన మొక్క జొన్న.. 70 రోజుల సమయంలోనే ఈ అకాల వర్షం, ఈదురుగాలుల తాకిడికి పొలంలోనే నేలకొరిగిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎకరం రూ.50 వేలు ఖర్చుపెట్టిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో సుమారు 500 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు అవుతుంది. ఈదురు గాలుల తాకిడికి, వర్షం తాకిడికి వందల ఎకరాల్లో పంట నష్టానికి గురైంది. పంట చేతికి రాకుండానే పూర్తిగా ధ్వంసం అవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
