Site icon NTV Telugu

Budi Mutyala Naidu: డిప్యూటీ సీఎం ఇంటి దగ్గర డ్రోన్ల కలకలం..

Budi Mutyala Naidu

Budi Mutyala Naidu

Budi Mutyala Naidu: అనకాపల్లి లోక్‌సభ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఇంటి దగ్గర ఓ డ్రోన్లు కలకలం సృష్టించింది.. దేవరపల్లి మండలం తారువ గ్రామంలో డిప్యూటీ సీఎం ఇల్లు, రాకపోకలు సాగించే మార్గంలో అగంతకులు రెక్కీ నిర్వహించినట్టు అనుమానిస్తున్నారు.. ఓ కారు, రెండు బైక్ ల పై వచ్చిన అగంతకులు ముత్యాలనాయుడు ఇల్లు, పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం వైసీపీ శ్రేణులు, ఆయన అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు.. డ్రోన్లు ఎగిరే సమయంలో ఇంట్లోనే ఉన్నారు ముత్యాల నాయుడు.. డ్రోన్లను గమనించి.. డిప్యూటీ సీఎం అలర్ట్ అవ్వడంతో.. డ్రోన్ లు ఎగురవేసిన యువకులను వెంబడించి పట్టుకున్నారు స్థానికులు.. తనపై హత్యాయత్నం కోసం పన్నాగంలో భాగంగానే డ్రోన్లతో రెక్కీ నిర్వహిస్తున్నారని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఆరోపిస్తున్నారు.

Read Also: Double Ismart : హమ్మయ్య.. రామ్ ఫ్యాన్స్ ఇప్పుడు హ్యాపీ..

అయితే, ఓ వైపు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో.. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ముత్యాలనాయుడు.. ఈ సారి అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ఆయన.. విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.. ఈ సమయంలో.. ఆయన ఇంటి దగ్గర డ్రోన్లు ఎగరవేసి.. రెక్కీ నిర్వహించడం కలకలం సృష్టిస్తోంది.

Exit mobile version