Kissing New York Council Member : వీడెవడ్రా బాబు.. న్యూయార్క్ కౌన్సిల్ సభ్యురాలికి లైవ్ లో ముద్దుపెట్టాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kissing New York Council Member : ఓ అపరిచిత వ్యక్తి సడెన్ గా వచ్చి మనకు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చిరాకుగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అయితే ఇది జరిగింది సామాన్యులకు కాదు. ఏకంగా ఓ ప్రజాప్రతినిధికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
న్యూయార్క్ కౌన్సిల్ వుమెన్ ఇన్నా వెర్నికోవ్ ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. న్యూయార్క్ సిటీ 48వ జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఇన్నా వెర్నికోవ్ బ్రూక్లిన్‌లోని బ్రైటన్ బీచ్ లో ఇంటర్య్వూ లో మాట్లాడుతున్నారు. సీబీఎస్ న్యూయార్క్ రిపోర్టర్ హన్నా క్లిగెర్ ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నారు. స్థానిక విషయాలపై వెర్నికోవ్ మాట్లాడుతుండగా ఆమెకు ఓ చేదు అనుభవం ఎదురయ్యింది.అనుకోకుండా అటునుంచి నడుచుకుంటూ వెళుతున్న ఓ అపరిచితుడు వచ్చి ఆమె బుగ్గపై ముద్దు పెట్టాడు. అనంతరం నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ అనుకోని ఘటనతో వెర్నికోవ్ షాక్ కు గురయ్యింది. వెంటనే తలను పక్కకు తిప్పేసుకుంది. అనంతరం అతడిని చూస్తూ పెద్దగా తిట్టింది వెర్నికోవ్.
Also Read
- BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
- Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
- AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
- Gas Subsidy: వారందరికీ గ్యాస్ సబ్సిడీ బంద్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
Also Read: Cat sentiment : దొంగలను పట్టించిన పిల్లి.. స్టోరీ తెలిస్తే నవ్వాపుకోలేరు
ఈ ఘటన గురువారం జరగగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై వెర్నికోవ్ స్పందిస్తూ తానేమి సొసైటి నుంచి ప్రేమను ఆశించడం లేదన్నారు. ఇది ఒక అసహ్యకరమైన ఘటన అంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంలో పలువురు వెర్నికోవ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. సహచర సిటీ కౌన్సిల్ సభ్యుడు లిన్ షుల్మాన్ ఈ ఘటనను ఖండించారు. వెర్నికోవ్ కు ఈ విషయంలో తన మద్దతును ప్రకటించారు. 2023 లో ఓ మహిళకు ఇష్టం లేకుండా ఇలా జరగడం బాధాకరమన్నారు. నెటిజన్లు కూడా ఈ ఘటనపై మండిపడుతున్నారు. మహిళపై ఇలా జరగడం సరికాదన్నారు. వెంటనే దుండగుడిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఇదిలా వుండగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేరం జరిగిన వెంటనే రియాక్ట్ పోలీసులు దీనిపై స్పందిచలేదు. ఈ ఘటనపై న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. పోలీసుల తీరు మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది.
Stranger kisses Brooklyn Councilwoman @InnaVernikov during an interview on Brighton Beach @CBSNewYork pic.twitter.com/xCIg01SxbE
— Hannah Kliger (@HannahKliger) August 18, 2023
తాజావార్తలు
-
BJP: ‘‘ఓట్ చోరీ జరిగితే మేం ఎలా ఓడిపోయాం’’.. కాంగ్రెస్‌కు బీజేపీ కౌంటర్..
-
Ellipaya Karam: నానమ్మల నాటి నాటు రుచి.. జ్వరం, జలుబును తరిమికొట్టే ఎల్లిపాయ కారం సింపుల్ ఇలా చేసేయండి!
-
Nani Wife : ఆరోజు మార్నింగ్ షో కూడా పడలేదు.. 16 ఏళ్ల కష్టానికి సాక్షిని నేనే.. నాని భార్య ఎమోషనల్
-
Bombay High Court: మత ఊరేగింపుల్లో బాణసంచా కాల్చొద్దు.. డీజేలు, లేజర్ బీమ్స్పై బాంబే హైకోర్టు కీలక ఆదేశాలు
-
AP Cabinet Key Decisions: కేబినెట్ కీలక నిర్ణయాలు.. నాలుగు కొత్త కమిషనరేట్లకు గ్రీన్‌సిగ్నల్.. వాటికి ఆమోదం..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!