NTV Telugu Site icon

Nitin Gadkari: పంజాబ్‌లో శాంతిభద్రతలు సరిగ్గా లేవు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గడ్కరీ

Nitin Gadkari

Nitin Gadkari

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పంజాబ్ ప్రభుత్వానికి లేఖ రాసి హెచ్చరించారు. ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, కాంట్రాక్టర్ల భద్రతకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయన తన లేఖలో ప్రశ్నలు సంధించారు. ఇలాగే కొనసాగితే రూ.14,288 కోట్ల విలువైన 293కిలోమీటర్ల ప్రాజెక్టులు ఆగిపోతాయన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు రాసిన లేఖ ప్రకారం..

READ MORE: Ram Charan: వావ్.. గేమ్ ఛేంజర్ లో మూడు పాత్రల్లో కనిపించనున్న రామ్ చరణ్

“ఢిల్లీ-కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌పై జరిగిన రెండు సంఘటనల గురించి నాకు ఇటీవల తెలిసింది. జలంధర్ జిల్లాలో ఓ కాంట్రాక్టర్ ఇంజనీర్‌పై దారుణంగా దాడి జరిగింది. నేను మీకు వారి ఫోటో పంపుతున్నాను. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మరోవైపు లూథియానా జిల్లాలో జరిగిన మరో ఘటనలో ఢిల్లీ-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఓ కాంట్రాక్టర్ ప్రాజెక్ట్ క్యాంపుపై దుండగులు దాడి చేశారు. ప్రాజెక్ట్ క్యాంపులో ఉన్న ఇంజనీర్లు, ఉద్యోగులను సజీవ దహనం చేయడానికి ఈ వ్యక్తులు ప్రయత్నించారు. ఈ విషయమై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా నేరగాళ్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల నమ్మకాన్ని నిలబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.” అని పేర్కొన్నారు.

READ MORE:Muppavarapu Venkaiah Naidu: నేతలపై వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. అలా అయితేనే రాజకీయాల్లోకి రండి

జులై 15న పంజాబ్‌లోని పీడబ్య్లూడీ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పంజాబ్ ప్రాజెక్టుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు కూడా కేంద్ర మంత్రి తన లేఖలో తెలిపారు. ఈ సమావేశంలో భూసేకరణ, శాంతిభద్రతలకు సంబంధించిన సమస్యలను ప్రాధాన్యతా ప్రాతిపదికన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, అయితే ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేదని పర్కొన్నారు. అక్కడ పరిస్థితి మరింత దారుణంగా మారిందని… పంజాబ్‌లో గతంలో 103 కిలోమీటర్ల మేర రూ.3263 కోట్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని హెచ్చరించారు. ఇది ఇలాగే కొనసాగితే రూ.14288 కోట్ల విలువైన 293కిమీ ప్రాజెక్టులు నిలిచిపోతాయని లేఖలో వెల్లడించారు.

Show comments