NTV Telugu Site icon

Nitin Gadkari: రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుకు రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్?.. కేంద్ర మంత్రి వివరణ..

Nitin Gadkari

Nitin Gadkari

రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు. సంభాషణ సందర్భంగా, ఢిల్లీ-జైపూర్ హైవేపై టోల్ ట్యాక్స్ ఖర్చు కంటే ఎలా పెరిగిందో నితిన్ గడ్కరీ ఉదాహరణతో వివరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ ప్రశ్నకు పూర్తి గణితాన్ని వివరించారు. ఒక్కరోజులో ప్రజల నుంచి టోల్‌ ట్యాక్స్‌ వసూలు చేయడం లేదన్నారు. టోల్ ట్యాక్స్ వసూలుకు ముందు, తర్వాత ప్రభుత్వం అనేక రకాల ఖర్చులను ఎదుర్కోవాల్సి వస్తుందని గడ్కరీ తెలిపారు. ఇది కూడా టోల్ పెరగడానికి కారణమని వెల్లడించారు.

READ MORE: Balineni Srinivasa Reddy Resignation Letter: బాలినేని రాజీనామా లేఖలో సంచలన అంశాలు.. రాజకీయ నిర్ణయాలు సరిగా లేవు..!

నితిన్ గడ్కరీ ఒక ఉదాహరణ చెబుతూ.. “ఒక వ్యక్తి రూ.2.5 లక్షలతో ఇల్లు లేదా కారు కొన్నాడనుకుందాం. ఆ వ్యక్తి 10 సంవత్సరాలకు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్లయితే, కారు, ఇళ్లు ధర పెరుగుతుంది. వినియోగదారుడు ప్రతి నెలా వడ్డీ చెల్లించాలి. చాలా సార్లు అప్పులు చేసి అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. అందువల్ల బాధ్యత కూడా పెరుగుతుంది. దాని వాయిదా చెల్లింపు కూడా పెరుగుతుంది. ఇలాగే రోడ్డు వేసేందుకు అప్పులు చేసినందుకు విలువ పెరిగింది” అని వివరించారు.

READ MORE: Actor Ali : జానీ మాస్టర్ వ్యవహారంపై అలీ రియాక్షన్..

ఢిల్లీ-జైపూర్ రహదారి (జాతీయ రహదారి-8) నిర్మాణ వ్యయం కంటే ఎక్కువ టోల్ వసూలు చేయబడిన విషయంపై కేంద్ర మంత్రి స్పష్టంగా వివరించారు. ఈ రహదారిపై అధిక టోల్ తీసుకోబడిందని కేసు నడుతస్తోంది. ఈ రోడ్డును 2009లో యూపీఏ ప్రభుత్వం కేటాయించింది. అప్పట్లో 9 బ్యాంకులను ఇందులో చేర్చారు. ఈ రహదారిని నిర్మించడంలో మంత్రిత్వ శాఖ చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చిందని గడ్కరీ చెప్పారు. కాంట్రాక్టర్లు మారారని నితిన్ గడ్కరీ చెప్పారు. బ్యాంకులు కేసు పెట్టాయి. ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

Show comments