రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్ ప్లాజాలో ధర కంటే ఎక్కువ టోల్ ట్యాక్స్ వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. రూ.1900 కోట్లతో నిర్మించిన రోడ్డుపై రూ.8000 కోట్ల టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేశారో, ఎలా వసూలు చేశారో ఓ న్యూస్ ఛానెల్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సవివరంగా వివరించారు.