Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Kishan Reddys Open Letter To Congress Leader Rahul Gandhi

Kishan Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Published Date :November 27, 2023 , 3:23 pm
By Rajesh Veeramalla
Kishan Reddy: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఉద్యమ ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో.. మీ అమ్మగారైన శ్రీమతి సోనియాగాంధీ యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండి కూడా.. దాదాపు 1200మంది ఆత్మహత్య చేసుకున్నాక గానీ.. తెలంగాణ ఇవ్వలేదు. ఇది కాకుండా.. నాడు విద్యార్థి లోకం, ఉద్యోగ, ఉపాధ్యాయసంఘాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తుంటే.. వారికి మద్దతు తెలపాల్సింది పోయి, రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎం, మజ్లిస్ పార్టీలతో మీరు జతకట్టారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది యువకిశోరాలను అత్యంత కిరాతకంగా తుపాకులతో కాల్చిచంపిన పార్టీ కాంగ్రెస్ కాదా? కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తర్వాత 2009లోనూ తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్ 9న ప్రకటన చేసి, ఆ తర్వాత 23వ తేదీన దీన్ని వెనక్కు తీసుకున్న సమయంలో ఇక్కడ రగిలిన మనసుల గురించి, ఆగిన గుండెల గురించి మీరు ఏనాడైనా ఆలోచించారా అని అన్నారు. అసలు డిసెంబర్ 23 నాటి మీ నిర్ణయంలో ఏదైనా శాస్త్రీయత కనిపించిందా..? లేక మజ్లిస్, సీపీఎం వంటి రాజకీయ మిత్రుల ఒత్తిడికి తలొగ్గారా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Sajjala Ramakrishna Reddy: టీడీపీకి చెందిన వ్యక్తి అని ఏ పథకమైనా ఆగిందా?

తెలంగాణ విషయంలో మొదట్నుంచీ బీజేపీ ఓ స్పష్టమైన ఆలోచనతో ఉందని కిషన్ రెడ్డి అన్నారు. కాకినాడలో చేసిన ఒక ఓటు, రెండు రాష్ట్రాల తీర్మానం మొదలుకుని.. పార్లమెంటులో స్వర్గీయ సుష్మాస్వరాజ్ పలుమార్లు పార్లమెంటులో గొంతెత్తడంతో.. తెలంగాణ విషయంలో మీ మొద్దునిద్ర వదిలిందని దుయ్యబట్టారు. నాడు లోక్‌సభ వేదికగా సుష్మాస్వరాజ్ చేసిన చారిత్రక ప్రసంగం ఇంకా ప్రజల కళ్లముందు కదలాడుతోందని తెలిపారు. తెలంగాణకు అండగా ఉండాలన్న సుష్మాస్వరాజ్ నిర్ణయం, పార్లమెంటు లోపల, బయట బీజేపీ చేసిన ఉద్యమం, తెలంగాణలో వందలాది మంది విద్యార్థుల బలిదానానికి తలొగ్గి మీరు ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు’ను ప్రవేశపెట్టారన్నారు. ఇది వాస్తవం కాదని చెప్పే ధైర్యం మీకుందా అని ప్రశ్నించారు. రాజకీయ స్వలాభం లేకుండా ఏ నిర్ణయాన్ని తీసుకోని మీరు, మీ పార్టీ.. తెలంగాణ ఏర్పడగానే కేసీఆర్ కుటుంబాన్ని మీ ఇంటిని ఇంటికి పిలిపించుకొని ఆశీర్వచనాలిచ్చి, ఫొటోలకు ఫోజులు ఇవ్వడం వెనక జరిగిన వాస్తవ కథనాలకు వాస్తవరూపం ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమవుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెరముందు రాజకీయంగా వైరుధ్యాన్ని పాటిస్తూనే.. తెరవెనుక కలిసిపనిచేయాలనే మీ దోస్తీ బట్టబయలైందని తెలిపారు.

Harish Rao: రైతుబంధుపై నేను తప్పుగా మాట్లాడలేదు..

అందుకే 2014, 2018ల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినా.. మీరు ప్రజాప్రాతినిధ్య చట్టం ఆధారంగా ‘గీత దాటిన’వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. మీ ప్రతి నిర్ణయం వంచనేనని ఆరోపించారు. చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు మీరు చేస్తున్న మోసం బట్టబయలైంది. తెలంగాణ ఎన్నికల్లో మీ అపవిత్ర దోస్తీని పసిగట్టిన జనం.. ఇరుపార్టీలకు సరైన బుద్ధి చెప్పనున్నారని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో, పార్లమెంటులో బిల్లుకు సహకరించుకోవడంలో మీ స్నేహాన్ని యావత్ తెలంగాణ సమాజం చూసిందని.. అవన్నీ గుర్తుంచుకుంది కూడా అని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విభజన సమస్యలన్నీ ఎక్కడ వేసిన గొంగడిలా అలాగే ఉన్నాయి. దీనికి కారణం.. మీ స్వార్థ బుద్ధి, రాజకీయ కుట్ర అని స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. కర్ణాటకలో మీ పార్టీ గెలిచేందుకే కేసీఆర్ డబ్బు పంపించాడంటూ అనేకరోపణలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణలో మీ ఎమ్మెల్యేలను గెలిపించడానికి కేసీఆర్ ఆర్థిక సహాయం చేస్తున్నాడని తెలంగాణ ప్రజలు తెలుసుకున్నారు. అందుకే రాష్ట్రంలో అమరవీరుల ఆకాంక్షలను, సొంతరాష్ట్రంలో బతుకులు బాగుపడతాయనుకున్న ప్రజల ఆశలను కాలరాస్తూ.. మీ రెండు కుటుంబ, అవినీతి పార్టీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు తెలగాణ ప్రజలు మీ ఇద్దరికీ సరైన బుద్ధి చెబుతారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • congress
  • Kishan Reddy
  • open letter
  • rahul gandhi

తాజావార్తలు

  • Uttam Kumar Reddy: రాష్ట్రంలో LPG సంక్షోభం.. కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ..

  • Jupally Krishna Rao: ఏపీ ప్రభుత్వానికి మంత్రి జూపల్లి హెచ్చరిక!

  • Girl Missing: హోంవర్క్ అని వెళ్లి అదృశ్యం.. 12 ఏళ్ల చిన్నారి అదృశ్యం కథ సుఖాంతం..!

  • Hey Balwanth : ఓటీటీలోకి సుహాస్ ‘హే బలవంత్’.. ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

  • Hyderabad: భారీ ‘వీర హనుమాన్ విజయ యాత్ర’.. ఏర్పాట్లపై పోలీసులు సమీక్ష..!

ట్రెండింగ్‌

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • Sanju Samson-CSK: అయ్యో పాపం.. సంజు ఖాతాలో చెత్త రికార్డు, సీఎస్‌కే కలిసి రాలేదా?

  • Ravindra Jadeja: పింక్ కలర్ నాకు బాగా సూట్ అయింది.. దూబేను అలా బుట్టలో వేశా!

  • MS Dhoni Invests: ఆ కంపెనీలో భారీగా పెట్టుబడులు పెట్టిన “మిస్టర్ కూల్”.. బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా..!

  • Anand Mahindra: 1000 ఏళ్ల నాటి మెట్ల బావి.. టెక్నాలజీకి ఫిదా అయిపోయిన ఆనంద్ మహీంద్రా..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions