Site icon NTV Telugu

Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్.. ఎందుకో తెలుసా?

Kishan Reddy

Kishan Reddy

ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ఆరా తీశారు. ప్రజల ప్రయాణ సౌలభ్యం కోసం ప్రాధాన్యతతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉప్పల్-ఘట్ కేసర్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూమి సేకరణలో ఆలస్యం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లక్షలాది ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడే ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ వైపు నిర్మిస్తున్న ఫ్లైఓవర్ కోసం భూమి సేకరణ ప్రక్రియలో జాప్యం అవుతున్న విషయాన్ని కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. ప్రాజెక్టు వేగవంతంగా పూర్తయ్యేలా వెంటనే భూమి సేకరణ పూర్తిచేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు రూ. 400 కోట్ల వ్యయంతో నిర్మితమైన అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను మే 5న కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఫ్లైఓవర్ కింద రోడ్డుపై ప్రజలకు అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశించారు.

READ MORE: Allu Arjun: ‘నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా’ అంటున్న అల్లు అర్జున్.. అసలు మ్యాటరేంటంటే?

కాగా.. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ అని.. అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ కీలకమని తెలిపారు. నిధుల కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ వంటి సమస్యలు బస్తీల్లో రొటీన్ అయ్యాయన్నారు.

READ MORE: Jagga Reddy: కుల గణనపై తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు..

నగరంలో అవసరమైన ప్రతిచోట స్ట్రీట్ లైట్స్, రీస్టోరేషన్ తక్షణ చర్యలు అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సమాన దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అప్జల్‌గంజ్ వరకే పరిమితమైన ఫస్ట్ ఫేజ్‌ను విస్తరించాలన్నారు. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్‌ల కోసం ప్రతిపాదనలు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం పంపించాలన్నారు.

Exit mobile version