Site icon NTV Telugu

Kishan Reddy: ఏడాది అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishanreddy

Kishanreddy

Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లా కుటుంబం ఆధారంగా నడిచే పార్టీ కాదని.. ప్రజాస్వామ్య బద్ధంగా నడిచే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. బూత్ స్థాయి నుండి మంచి నాయకత్వం రావాలి.. మంచి కమిటీలు ఏర్పాటు కావాలన్నారు. బీజేపీ వర్క్ షాప్‌లో కిషన్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉందని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని మోడీ అన్నారని తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని చెప్పారన్నారు. మనం ఉద్యమ రూపకల్పన చేయాల్సి ఉందని బీజేపీ నేతలకు కిషన్‌ రెడ్డి సూచించారు. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు… గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ లను ప్రాసెస్ చేసి నేను ఉద్యోగాలు ఇచ్చాను అని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఏడాది అయినా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.

Read Also: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల పాస్‌పోర్టులను సస్పెండ్ చేసిన కేంద్రం

రేపు బీజేపీ ఛార్జ్‌షీట్‌ను తెలంగాణ ప్రజల ముందు పెట్టబోతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వ పాలన వైఫల్యాలపై ఈ డిసెంబర్ 6న సరూర్ నగర్ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభ జరగనుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. సభకు బీజేపీ జాతీయ నేతలు అమిత్‌ షా లేక జేపీనడ్డా హాజరయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

Exit mobile version