Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Kishan Reddy Participated Rojgar Mela Program At Hyderabad

Kishan Reddy: కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తాం..

Published Date :October 29, 2024 , 10:44 am
By Mahesh Jakki
  • కేంద్ర ప్రభుత్వ రోజ్ గార్ మేళా
  • హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • తెలంగాణలో 155 మందికి నియామక పత్రాలు
Kishan Reddy: కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్ని భర్తీ చేస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: కేంద్ర ప్రభుత్వ రోజ్‌గార్‌ మేళాలో భాగంగా నేడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు అందజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 51 వేల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 155 మందికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. 10 విభాగాల్లో ఉద్యోగాలు ఉండగా.. ఒక్క పోస్టల్ డిపార్ట్ మెంట్‌లోనే 119 మందికి నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచాన్ని శాసించే స్థాయికి భారత్ చేరుకుందన్నారు. అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడానికి యువశక్తిని వినియోగించుకోవడం అవసరమన్నారు. 2047 వరకు వికసిత భారత్ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలన్నారు. అనేక కంపెనీలకు మన వాళ్ళు సీఈఓలుగా ఉన్నారని తెలిపారు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చాం.. మాతృ భాషలకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఏది కనుగొన్నా దానిలో భారతీయుల మేధస్సు ఉందని తెలిపారు. 75 దేశాలకు డిఫెన్స్ పరికరాలు ఎక్స్‌పోర్ట్ చేస్తున్నామని చెప్పారు.

Read Also: Tirupati Crime: అసిస్టెంట్‌ బ్యాంక్‌ మేనేజర్‌ అనుమానాస్పద మృతి

ఈ రోజు ఎక్కడ కూడా ఉగ్రవాద కార్యక్రమాలు లేకుండా ఐఎస్ఐ మూలాల్ని ఉక్కుపాదంతో అణచి వేశామని వెల్లడించారు. విద్యుత్ మిగులు ఉన్న నూతన భారత్‌ను మోడీ ఆవిష్కరించారన్నారు. పేదవాడి ఇంట్లో టాయిలెట్ నుండి మొదలు పెడితే చంద్రయాన్ వరకు అన్నింటి పైన మోడీ సర్కార్ దృష్టి పెట్టిందన్నారు. యువశక్తి లేని దేశం అభివృద్ధి చెందడం కష్టం… వచ్చే 25 ఏళ్లు ఇండియాకి అమృత కాలమని తెలిపారు. 25 ఏళ్ల తర్వాత దేశంలో యువత తగ్గిపోతుందన్నారు. ఈ దేశాన్ని, తల్లిదండ్రులను, సొంత గ్రామాన్ని, మాతృ భాషను మరవకండి అంటూ యువతకు కేంద్రమంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కేంద్ర మంత్రులు దీపావళి సైనికులతో జరుపుకోవాలని ప్రధాని మోడీ ఆదేశాలు ఇచ్చారని.. తాను వెళ్తున్నానని చెప్పారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Appointment Letters
  • hyderabad
  • Kishan Reddy
  • rojgar mela
  • telangana

తాజావార్తలు

  • Asha Bhosle: 10 ఏళ్ల కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..

  • Asha Bhosle Telugu Songs: ‘నాలో ఊహలకు’.. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఆశా భోస్లే పాటలు విన్నారా..?

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions