NTV Telugu Site icon

Kishan Reddy: ఏపీ విభజనపై మోడీ చేసిన వ్యాఖ్యల్లో తప్పేముంది..

Kishan Reddy

Kishan Reddy

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మోడీ ఎవరినీ విమర్శించలేదు.. విభజన టైంలో పార్లమెంట్‌లో చోటు చేసుకున్న అంశాల గురించే ప్రస్తావించారని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో పెప్పర్ స్ప్రేను వాడలేదా.. పార్లమెంట్ తలుపులు మూయలేదా అని కిషన్ రెడ్డి అడిగారు.

Read Also: Crime: ప్రయివేట్ ఫైనాన్షియర్ చేతిలో మాజీ హోంగార్డ్ మృతి

పాత పార్లమెంట్‌లో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాల గురించి చెబుతూ మోడీ ఏపీ విభజన గురించి గుర్తు చేశారని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ కుటుంబం ప్రస్తుతం ఏది అర్ధం చేసుకునే పరిస్థితిలో లేదని ఆయన దుయ్యబట్టారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌తో అధికారం పంచుకుందని.. ఆ సమయంలోనే తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ ఆలస్యం చేసిందని ఆయన విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు.. కానీ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Read Also: World Cup 2023: టీమిండియా ప్రపంచకప్‌ గెలవడం ఖాయమన్న మాజీ కెప్టెన్

అయితే ఏపీ విభజనకు సంబంధించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోడీ అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు రాష్ట్ర సాధన కోసం ప్రజలు ఆరు దశాబ్దాలుగా అవిశ్రాంతంగా పోరాడారని.. ఎట్టకేలకు 2014 జూన్ 2న తమ కలను సాకారం చేసుకున్నారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రావతరణ దిశగా సాగిన ప్రయాణం ఎన్నో త్యాగాలతో కూడుకున్నదని చెప్పుకొచ్చారు. తెలంగాణ యువకుల త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొవాల్సి ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు.

Show comments